Site icon Sanchika

విలువ

[dropcap]తి[/dropcap]మిరం తో సమరం చేస్తేనే కదా
వెలుగు విలువ తెలిసేది
అజ్ఞానం తో పోరాడితేనే కదా
విజ్ఞానం పై విలువ పెరిగేది
అవినీతి పై పోరాడితేనే కదా
నీతి అంటే ఏమిటో తెలిసేది
ఆకలితో కడుపు మాడితేనే కదా
అన్నం విలువ పెరిగేది
కష్టపడి సంపాదించితేనే కదా
డబ్బు విలువ తెలిసేది
కరువు, కాటకాలు వచ్చినప్పుడే కదా
వర్షం విలువ తెలిసేది
కష్టాలు వచ్చినప్పుడే కదా
భగవంతునిపై భక్తి పెరిగేది
వంటలు రుచిగా లేనప్పుడే కదా
ఉప్పు విలువ తెలిసేది
మనసులో కోరికలు ఏమీ లేనప్పుడే
కదా
ధ్యానం విలువ తెలిసేది
సహాయం పొందినపుడే కదా
కృతజ్ఞత విలువ తెలిసేది
గర్వం లేనప్పుడే కదా
ఎదుటి మనిషిని గౌరవంగా చూసేది……

 

Exit mobile version