విలువలు కోల్పోతున్న లక్ష్యాలు

    0
    3

    [box type=’note’ fontsize=’16’] ‘పిల్లలకి విద్యనే కాదు… విలువలతో కూడిన సంస్కారాన్ని అందించాలి. మనం బ్రతికేది సమాజంలో… అడవిలో కాదు… ఒంటరిగా బ్రతకడానికి’ అని చెప్పే కథ కుసుమంచి శ్రీదేవి వ్రాసిన “విలువలు కోల్పోతున్న లక్ష్యాలు”. [/box]

    [dropcap style=”circle”]గు[/dropcap]ప్తేశ్వర్రావు, జ్ఞానేశ్వర్రావు చిన్ననాటి స్నేహితులు… చదువు అనంతరం ఇద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, వివాహాలు చేసుకుని చక్కగా ఒకే ఊరిలో జీవిస్తున్నారు. ఇద్దరికీ ఒక్కక్క అబ్బాయే… వారు కూడ ఒకే వయసు.. ఒకే తరగతి… మంచి స్నేహితులు.

    జ్ఞానేశ్వర్రావు ప్రపంచ పోకడెరిగి, పరిస్థితుల కనుగుణంగా అర్థం చేసుకుని జీవిస్తుంటాడు. కాని గుప్తేశ్వర్రావు పేరులోనే కాదు బయట కూడ ప్రతీ విషయం గుప్తంగా ఉంచి… ఏవో దూరపు ఆలోచనలు… భవిష్యత్ కోసం ముందు జాగ్రత్తలు… తన నిర్ణయమే మేటిది అన్నట్టు బయటికి కనబడని చిన్న ఇగో చూపిస్తుంటాడు… ప్రతీ విషయంలో తను ఓ స్థాయి ఎక్కువుగా ఉండాలనుకుంటాడు..

    ఇద్దరి పిల్లలు 10వ తరగతి పరీక్షలు ఒకే మార్కులలో ఉత్తీర్ణలయ్యారు. మార్కులు చూసి జ్ఞానేశ్వర్రావు చాలా సంతోషించి వాళ్ళ అబ్బాయికి నచ్చిన గ్రూపులో ఆ ఊరిలోనే మంచి కాలేజీలో జాయిన్ చేసాడు.

    అన్నింటిలోను తను ఒక ఆకు ఎక్కువగా ఉండలనుకునే గుప్తేశ్వర్రావుకి మొహం ముడుచుకుపోయింది. ఇద్దరి పిల్లలకి ఒకే మార్కులు రావడం వలన.

    తన బాబు జ్ఞానేశ్వర్ వాళ్ళ బాబు కంటే మంచి స్థాయిలో ఉండాలని, తన స్థాయి దాటి లక్ష్యాన్ని ఏర్పరచి, పై ఊరు తన స్థాయికి మించిన కార్పోరేటు కాలేజీలో… తన భార్య ఎంత చెప్పిన వినకుండా, తల్లి బిడ్డలని వేరు చేసి, కొడుకుకి ఇష్టం లేకపోయిన బలవంతంగా జాయిన్ చేసాడు…

    గుప్తేశ్వర్ కోరుకున్నట్టే ఇంటర్ మంచి మార్కులు వచ్చాయి.., ఇంజనీరింగ్ కూడ పై ఊరిలోనే… డబ్బులు బాగా ఖర్చుపెట్టి… ఇంజనీరింగ్ కూడ తన దగ్గర పిల్లవాడిని ఉంచుకోకుండా చదివించాడు.

    జ్ఞానేశ్వర్ మాత్రం తన ఇంటికి ప్రతీ రోజు రాగలిగే కాలేజీలలో చదివించి ఇంజనీరింగ్ పూర్తిచేయించి… తల్లిదండ్రుల ప్రేమని బిడ్డకి అందించి, తనని చదివించడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని, బాధ్యతలని తెలుసుకునేలా ప్రేమతో పెంచాడు…

    ఇవేవి తెలియకుండా యాంత్రికంగా… ఓ పెట్టుబడి పెట్టే సరుకులాగా గుప్తేశ్వర్ కొడుకు పెరుగుతూ వచ్చాడు…

    ఇంజనీరింగ్‌లు పూర్తి అయ్యాక జ్ఞానేశ్వర్ తన కొడుకుకి దేశంలో ఉండే కంపెనీలకు మాత్రమే అప్లై చేసాడు…

    కాని గుప్తేశ్వర్ ఒక మెట్టు ఎక్కువ ఉండాలని అనుకుంటాడు కదా! భార్య… కొడుకు మాటలు

    వినకుండా అన్నీ విదేశాల కంపెనీలకు తన కొడుకు జాబ్ కోసం అప్లై చేసాడు…

    జ్ఞానేశ్వర్ కొడుకుకి చెన్నైలో జాబ్ వచ్చింది. గుప్తేశ్వర్ కొడుకుకి లండన్‌లో జాబ్ వచ్చింది…

    ఇద్దరూ వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు…

    ఇంతలో జ్ఞానేశ్వర్‌కి ఆరోగ్యం కొంచెం కుంటుపడింది… తండ్రి నాకేమి ఫర్వాలేదు అని ఎంత చెప్పిన వినకుండా, జ్ఞానేశ్వర్ కొడుకు వచ్చి, ప్రక్కనున్న పట్నంలో జాబ్ చూసుకుని వచ్చేసాడు…

    తండ్రికి దగ్గరుండి వైద్యం చేయిస్తూ… ఉద్యోగం చేసుకుంటాడు…

    ఇదంతా చూసిన గుప్తేశ్వర్‌కి తన (జ్ఞానేశ్వర్) కోసం కొడుకు భవిష్యత్ పాడు చేస్తున్నట్టు మనసులో ఎప్పుడూ అనుకునేవాడు… జ్ఞానేశ్వర్ కొడుకు మాత్రం తను చెన్నై నుండి వచ్చినందుకు బాధపడకుండా ఇక్కడ కంపెనీలోనే ఉన్నత స్థాయిలోకి ఎదగడానికి ప్రయత్నిస్తూ… ప్రమోషన్ తెచ్చుకుంటాడు…

    ఈ విషయం జ్ఞానేశ్వర్ గుప్తేశ్వర్‌కి చెప్పుతాడు… ప్రమోషన్ వచ్చిందని చెప్పిన చిన్నచూపే చూస్తాడు గుప్తేశ్వర్ జ్ఞానేశ్వరని…

    భర్తతో చెప్పలేక… కొడుకు మీద బెంగతో ఒక్కసారిగా మంచం పడుతుంది గుప్తేశ్వర్ భార్య… ఈ డాక్టర్లుకి చూపిస్తే… తను ఏదో మానసికంగా లోలోపల కుమిలి పోతుంది… అని చెప్పేరు.

    అప్పుడు ఈ గొప్పల తండ్రి గుప్తేశ్వర్‌కి అర్థమైంది… కొడుకు మీద బెంగ పెట్టుంది తన భార్య అని…

    తన కొడుకుకి ఫోను చేసి రమ్మని చెప్పేడు.. చెప్పగానే కొడుకు తాపీగా “అయ్యో!ఈ విషయానికే రావడం దేనికి డాడి! వీడియో కాల్ చేస్తాను. అమ్మతో మాట్లాడించు” అన్నాడు… ఒక్కసారి తన చంపపై తానే కొట్టుకున్నట్టు అయ్యింది…

    వీడియో కాల్ చేసినా భార్యలో ఏ మాత్రం మార్పు లేదు… రేయింబవళ్ళు కొడుకునే తలుచుకుంటుంది వెర్రి బాగుల భార్య… ఇంకా భార్య ఆరోగ్యం కుంటుపడుతూనే ఉంది. డాక్టర్ మరి ఇక్కడ వైద్యం పనికిరాదు అని చెప్పేరు. ఈ విషయం గుప్తేశ్వర్ తన కొడుకుకి చెప్పేడు… కొడుకు వెంటనే “నాకు ఇండియాలో తెల్సిన మంచి వైద్యుడి అడ్రస్ ఇస్తాను. అమ్మని అక్కడకి తీసుకువెళ్ళండి” అని సలహా ఇచ్చి… “డబ్బులు నేనే చూసుకుంటాను లే డాడి” అని చెప్పి ఫోను పెట్టేసాడు…

    తెల్లవారింది భార్య నిర్జీవమై మంచాన పడి ఉంది… తన కొడుకు కోసం ప్రేమతో చేయించిన లాకెట్ బిళ్ళ చేతిలో పట్టుకుని..

    తల్లి చనిపోయిన విషయం తెల్సి “అయ్యో! అమ్మని నేను చెప్పిన హాస్పటల్ కి తీసుకు వెళ్ళలేదా!” అన్నాడే తప్ప రెండు కన్నీటి చుక్కలు కార్చాలని తెలియలేదు! ఇంత చెప్పినా చనిపోయిన తల్లి తన గురించే బెంగపెట్టుకుందా అన్న ఆవేదన కొడుకు మాటల్లో కనబడలేదు!

    “అయితే రా నాన్న నువ్వు చేయవల్సిన పనులు ఇంకడున్నాయి…” అన్నాడు తండ్రి!

    “నేను వచ్చేసరికి లేటు అవుతుంది! ఫర్వాలేదా” అన్నాడు కొడుకు!

    ఆ మాటకి భార్య ప్రాణమేమో గాని తన ప్రాణం పోయినట్టయ్యింది…

    ‘ఇంత ఘోరంగా విలువలు నేర్పకుండా, బాధ్యతలు తెలియకుండా యాంత్రిక జీవనాన్ని అందించాను! తప్పు నాది. పిల్లలని ఉన్నతస్థాయిలో ఉంచాలనుకోవడం తప్పులేదు! జ్ఞానేశ్వర్‌లా విలువలతో కూడిన విద్యని అందించాలి!! అప్పుడే తల్లిదండ్రుల బాధ్యత సంపూర్ణమౌతుంది!

    పిల్లలకి విద్యనే కాదు… విలువలతో కూడిన సంస్కారాన్ని అందించాలి. మనం బ్రతికేది సమాజంలో… అడవిలో కాదు… ఒంటరిగా బ్రతకడానికి’ అని బాధపడుతూ… తన స్నేహితుని సహాయంతో తన అంత్యక్రియలు పూర్తి చేసాడు గుప్తేశ్వర్.

    లండన్ నుండి వచ్చిన తన కొడుకుని ఇక్కడే ఉంచి… ఇక్కడే మంచి అమ్మాయితో పెళ్ళి చేసి… తన మనవళ్ళకి చిన్నప్పటి నుండే బంధాల విలువ తెలియజేస్తూ విలువలతో కూడిన విద్యనందించాడు గుప్తేశ్వర్…

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here