Site icon Sanchika

విశాఖ సాహితి స్వర్ణోత్సవ సభ

[dropcap]4[/dropcap]-4-2021 సాయంత్రం 6:00 గంటల నుండి, విశాఖ సాహితి స్వర్ణోత్సవాల సందర్భంగా ‌స్వర్ణజయంతి సమావేశం, విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన ‘జూమ్’ మాధ్యమం ద్వారా జరిగింది.

ఈ సమావేశంలో విశాఖ సాహితి సభ్యులే కాక విదేశాల నుండి కూడా సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమా రచయిత, విశాఖ సాహితి వరిష్ఠ సభ్యులు శ్రీ ఉన్నవ వెంకట హరగోపాల్ గారు, విశాఖ సాహితి వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ మల్లాప్రగడ రామారావు గారు, విశాఖ సాహితి పూర్వ కార్యదర్శి శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు గారు ప్రసంగించారు.

ఈ సందర్భంగా విశాఖ సాహితి మీద తయారు చేసిన వీడియో ‘తెర తీయగ రాదా’ విడుదల చేయడం జరిగింది

విజయవంతంగా ముగిసిన ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం స్వాగతం పలికారు. శ్రీమతి లలితా వాశిష్ఠ వందన సమర్పణ చేశారు.

Exit mobile version