[మే 28న శ్రీ నందమూరి తారక రామారావు శతజయతి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు కె. హరి మధుసూదన రావు.]
[dropcap]‘వి[/dropcap]శ్వ విఖ్యాత నట సార్వభౌమ’ ఈ బిరుదును నందమూరి తారక రామారావుకు ప్రదానం చేసింది ఎవరో కాదు నడిచే దేవుడిగా పేరొందిన కంచి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉండే పరమాచార్య వద్దకు ఒక రోజు ఒక భక్తుడు వచ్చి ‘సీతారామ కల్యాణం’ చిత్రాన్ని గురించి చెప్పాడు. ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా వేయించుకొని చూసి రామారావు నటనా ప్రతిభను మెచ్చుకొని ఆశీర్వదిస్తూ రామారావుకు ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేశారు. రామారావు తన అద్భుత నటనా శైలితో ఆ బిరుదుకు న్యాయం చేకూర్చాడు.
బాల్యం:
నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో రామారావు జన్మించాడు. చిన్నప్పుడు బుల్లి అని ముద్దుగా పిలిచేవారట. లక్ష్మయ్య దంపతులకు మరో కుమారుడు జన్మించాడు. ఆ అబ్బాయికి త్రివిక్రమ రావు అనే పేరు పెట్టారు. లక్ష్మయ్య చౌదరి తండ్రి రామస్వామి చౌదరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆస్తిపరుడు. లక్ష్మయ్య ఆస్తిని వృద్ధి చేయాలని కొంత భూమిని కొని వ్యవసాయం చేశాడు. కానీ అందులో గిట్టుబాటు ధర కూడా రాలేదు. సొంత భూమిని కూడా అమ్మి అప్పులను తీర్చటంతో బీదవాడయ్యాడు. వెంకటరామమ్మ అక్క చంద్రమ్మ భర్త కొమరవోలుకు చెందిన రామయ్య. వీరికి పిల్లలు లేకపోవడంతో రామారావును దత్తత తీసుకొన్నారు. రామయ్య నాటకాలు వేసేవాడు. ఎప్పుడూ చక్కగా దువ్వుకొని, తెల్లటి దుస్తులు వేసుకొని ఉండే రామయ్యను ‘షోకు రామయ్య’ అని పిలిచేవారు. ఆ పెదనాన్నే చిన్నప్పుడు రామారావుకు భారత, రామాయణ ఇతిహాసాలను చెప్పేవాడు. వల్లూరు సుబ్బారావు అనే మాస్టారి వద్ద కొంతకాలం చదువు చెప్పించాడు. తరువాత భుజంపై ఎత్తుకొని అవిరిపూడిలో రోజూ బడికి తీసుకెళ్ళేవాడు. హైస్కూల్ చదువు కోసమని విజయవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మునిసిపల్ స్కూల్లో తారకం బాబుని చేర్పించాడు. కొంతకాలం బస్ కండక్టర్‌గా చేస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్లో రామయ్య కాలు విరిగింది. దీనితో రామయ్యను నిమ్మకూరులో ఉంచి, లక్ష్మయ్య దంపతులు విజయవాడ చేరి పాల వ్యాపారం మొదలెట్టారు. ఎన్టీఆర్ రోజూ ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి పాలు పితికి, ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాడు. ఉదయం ఆరు గంటలకు తాలింఖానాలో వ్యాయామం చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఒకరోజు నిమ్మకూరులో పెదనాన్న రామయ్య దగ్గరికి వెళ్లి సరుకులు తీసుకొని సాయంత్రం సైకిల్లో విజయవాడకు బయలుదేరాడు. మధ్యలో టైర్ పంచరైనా ధైర్యంగా విజయవాడకు వచ్చాడు. ఇంటికి చేరుకొనేసరికి అర్ధరాత్రి అయిందట. ఎన్టీఅర్ ధైర్యానికి ఇదొక నిదర్శనం. పాల వ్యాపారం వృద్ధిలోకి వచ్చి లక్ష్మయ్య ఒక సొంత ఇల్లు కొన్నాడు. తన తమ్ముడు నాగయ్య పొలం అమ్ముతున్నాడని తెలిసి కొంత డబ్బుని అతనికి పంపాడు.
తొలి నాటకం:
ఎన్టీఆర్ ఇంటర్ చదివేటప్పుడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు బోధనతో పాటూ నాటకాలు వేయించేవారు. ‘రాచమల్లుని దౌత్య కార్యం’ అనే నాటకంలో నాయకురాలు నాగమ్మ పాత్ర ఎన్టీఆర్ వేయాలి. నాటకానికి అంతా సిద్ధమయ్యింది. ఎన్టీఆర్‌ని మీసాలు తీసివేయమని విశ్వనాథ సత్యనారాయణ చెప్పారు. అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. నాటకం వేయడానికి సమయం దగ్గర పడటంతో మీసాలతోనే ఎన్టీఆర్ నాటకం వేశాడు. నాటకంలో బాగా ఎన్టీఆర్ నటించడంతో విశ్వనాథ సత్యనారాయణ మెచ్చుకొన్నారు. అయితే అప్పటినుండీ ఎన్టీఆర్‌ను ‘మీసాల నాగమ్మ’ అని స్నేహితులు పిలిచేవారు.
ఆత్మగౌరవం:
ఉద్యోగం:
నేషనల్ ఆర్ట్ థియేటర్:
గుంటూరులో చదివేటప్పుడు జగ్గయ్య, వల్లభజోస్యుల శివరామ్, కె.వి.యస్.శర్మ, మల్లికార్జున రావు మొదలగు క్లాస్మేట్స్ ఎన్టీఆర్‌తో కలిసి బలిదానం, అలీ దో కాబ్లర్ మొదలగు నాటకాలు వేసేవారు. తరువాత వీళ్ళు సినిమాల్లోకి వచ్చారు. మల్లికార్జున రావు సినీనటి శివరంజని అబ్బాయి కావడంతో ఒక రోజు ‘నాయకురాలు’ అనే నాటకం వేస్తున్నప్పుడు శివరంజని భర్త నాగుమణి చూశాడు. ఎన్టీఆర్ నటన చూసి మెచ్చుకొని చిత్తజల్లు పుల్లయ్యకు పరిచయం చేశాడు. ఆయన మద్రాసుకు రమ్మని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసి వస్తానని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసి ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగానికి అప్లై చేస్తే డెహ్రాడూన్‌కు రమ్మని కాల్ లెటర్ వచ్చింది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో వెళ్ళలేదు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి తన కాలేజీ మిత్రుల సహాయంతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఈ నాటకాల్ని చూసిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఎన్టీఆర్‌ని మద్రాస్‌కు తీసుకెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేసి, క్రొత్త సినిమా తీసేటప్పుడు కబురు పంపుతానని చెప్పారు. ఈ మధ్యలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్రాసి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా చేరాడు. కొన్ని రోజుల తరువాత ఎల్వీ ప్రసాద్ నుంచి ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమాలో నటించడం కోసం రమ్మని కబురొచ్చింది. ఉద్యోగం వదిలిపెట్టి మద్రాస్ వెళ్ళాడు. ఈ సినిమాను బి.ఎ. సుబ్బారావు తీస్తున్నారు.
మొదటి సినిమా మన దేశం:
విభిన్న పాత్రలు:
నిర్మాతగా:
దర్శకునిగా:
రావణాసురుడిని విభిన్న కోణంలో చూపించాలనే కోరికతో ఎన్టీఆర్ కె.వి. రెడ్డి దగ్గరికి వెళ్లి సీతారామ కళ్యాణానికి దర్శకత్వం చేయవలసిందిగా కోరాడు. ‘మాయాబజార్’లో కృష్ణునిగా చూపిన నిన్ను రావణాసురునిగా చూపలేనని చెప్పడంతో తానే దర్శకనిర్మాతగా మారి ఎన్టీఆర్ ఈ సినిమాను నిర్మించాడు. సాలూరు రాజేశ్వరరావు కొన్ని పాటలకు సంగీతమిచ్చి తప్పుకొన్నారు. సినిమాలకు సంగీత సారథ్యం నుంచి దాదాపు తప్పుకున్న గాలిపెంచల నరసింహారావుని సంగీత దర్శకునిగా ఒప్పించాడు. ఆయన చేసిన ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ అనే పాట వినిపించని పెళ్లిమంటపం లేదు. బొంబాయిలో ఉన్న రవికాంత్ నగాయిచ్ని ఛాయాగ్రాహక దర్శకుడిగా ఎంచుకున్నాడు. రావణాసురుని పది తలలతో చూపించే మాస్క్ షాట్ షూటింగ్ కోసం పది గంటలు కదలకుండా నిలబడ్డ ఎన్టీఆర్‌ని చూసి కెమరామెన్ నగాయిచ్ ఆశ్చర్యపోయాడు. హరినాథ్‌ని రామునిగా, మణిని సీతగా ఎంపికచేశాడు. ఆ మణి యే హీరోయిన్ గీతాంజలి. సినిమా పూర్తి అయిన తరువాత కె.వి.రెడ్డికి ఎన్టీఆర్ చూపించాడట. శెభాష్ బాగా తీశావని ఆయన మెచ్చుకున్నారట.
‘గులేబకావళి కథ’ ద్వారా జోసెఫ్ కృష్ణముర్తిని సంగీత దర్శకునిగా, సి.నారాయణ రెడ్డిని పాటల రచయితగా పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌కి దక్కుతుంది. ‘శ్రీకృష్ణ పాండవీయం’లో కృష్ణుని లోని లాలిత్యం, దుర్యోధనుని లోని గాంభీర్యం చక్కగా చూపించాడు. మొదటి రెండు సినిమాలకు దర్శకత్వ పేరు వేసుకోక పోయినా ఈ చిత్రంలో దర్శకత్వం వహించినట్లు పేరు వేసుకున్నాడు.
అనితర సాధ్యం:
ఎన్టీఆర్ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ‘దాన వీర శూర కర్ణ’ ఒక్కటి ఒక ఎత్తు. అత్యధిక నిడివి గలిగిన సినిమా తీసి ప్రేక్షకులకు ఆప్పుడే సినిమా అయిపోయిందా! అన్నట్లు భ్రమింపజేయడం ఒక్క ఎన్టీఆర్కే చెల్లు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడిగా మూడు పాత్రలు వేస్తూ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే అన్నీ తానే అయి 43 రోజులలో నాలుగు గంటల ఏడు నిమిషాల సినిమా తీయటం, అందులో దాదాపు నాలుగు గంటలు తెరపై కనబడడం ఎన్టీఆర్కే సాధ్యం. కొత్తగా రామక్రిష్ణా స్టూడియో కట్టి, తనను నటునిగా చేసిన ఎల్వీ ప్రసాద్చే ప్రారంభం చేయించాడు. బి.నాగిరెడ్డి ఈ సినిమాకు స్విచ్ ఆన్ చేస్తే, ఎం.జి.రామచంద్రన్ క్లాప్ కొట్టారు. ఒక పక్క ఇదే కథాంశంతో కురుక్షేత్రం సినిమా ఎక్కువ బడ్జెట్‌తో ఉత్తర భారతదేశంలో భారీ సెట్టింగ్స్ వేసి కృష్ణ తీస్తున్నాడు. ‘పాండురంగ మహత్యం’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణావతారం’ వంటి సినిమాలు తీసి పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు కురుక్షేత్రానికి దర్శకుడిగా చేస్తున్నారు. శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగభూషణం, మోహన్ బాబు, చంద్రమోహన్, అంజలీదేవి, జమున ఇలా చాలా మంచి నటులు నటిస్తున్నారు. కానీ ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకు అన్నీ తానై ఎన్టీఆర్ దాదాపు హైదరాబాద్ లోనే షూటింగ్ పూర్తి చేశాడు. తొందరగా చేసిన ఈ సినిమాలో కొన్ని చోట్ల దారాలు కనబడడం వంటి లోపాలున్నా ఎన్టీఆర్‌ని చూస్తూ ఆయన డైలాగులు వింటూ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ‘ఏమంటివి ఏమంటివి’ అనే డైలాగ్ ఇప్పటికీ కొందరి సెల్ ఫోన్లో కాలర్ ట్యూన్‌గా ఉందంటే ఎంత ప్రభావితం చేసిందో తెలుస్తుంది. ఒక ప్రక్క ‘కురుక్షేత్రం’ అంతంత మాత్రమే ఆడితే ‘దాన వీర శూర కర్ణ’ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ద్వారా సంభాషణలు వ్రాసిన కొండవీటి వెంకట కవిని, కెమరామెన్ కె.యస్.ప్రకాష్‌ని సినీ రంగానికి పరిచయం చేశాడు.
గేవా కలర్లో మొదటి తెలుగు సినిమా ‘లవకుశ’లో నటించి ప్రేక్షకులకు రాముడంటే రామారావు రామారావు అంటే రాముడు అనిపించాడు. రాముడు అనే పేరుతో అడవి రాముడు, డ్రైవర్ రాముడు, శృంగార రాముడు, ఛాలెంజ్ రాముడు, రౌడీ రాముడు, సరదా రాముడు, కలియుగ రాముడు ఎన్ని సినిమాలు తీసాడో చూస్తే అర్థమవుతుంది. శ్రీమద్విరాట పర్వంలో కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, దుర్యోధనుడు, కీచకుడుగా ఐదు పాత్రలలో నటించిన యుగపురుషుడు ఎన్టీఆర్. వయస్సు పెరిగే కొద్దీ ఆయనలో నటన ఉరకలేసింది అని చెప్పడానికి సూపర్ మాన్, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి మొదలగు సినిమాలే నిదర్శనం. వీరబ్రహ్మేంద్రస్వామిగా, బ్రహ్మర్షి విశ్వామిత్రగా, అశోక సామ్రాట్‌గా, శ్రీనాథునిగా, మేజర్ చంద్రకాంత్‌గా నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు కాబట్టే ఇన్ని రోజులైనా అత్యంత పాపులర్ నటుడిగా ప్రేక్షకులచే ఎంపికయ్యాడు.
ప్రజా సేవలో:
Image Credits: Internet