Site icon Sanchika

విశ్వనాథ జయహో

[dropcap]వి[/dropcap]శ్వనాథ జయహో
సినీ విశ్వనాథ జయహో
ఆత్మగౌరవం ఆత్మస్థైర్యమై

వెలిగిన విశ్వనాథ జయహో
సినీ విశ్వనాథ జయహో

స్వయంకృషితో శృతి లయలకు స్వరాభిషేకం జరిపిన స్వర్ణకమలమా జయహో
సినీ విశ్వనాథ జయహో

స్వాతిముత్యముల స్వాతికిరణముల
ఆణిముత్యమా జయహో
సినీ విశ్వనాథ జయహో

సాగరసంగమ వేళలో
సిరివెన్నెల కురిసిన వేదికపై
కథనే హీరో చేసి
కథనాన్నే వధువుగ మలచి నిండు దంపతులుగ మది తలచి శంకరాభరణ రాగంలో
అందమైన శుభలేఖను వ్రాసి సిరిసిరిమువ్వల సవ్వడిలో
సప్తపదు లు నడిపింపగ చేసిన కళాతపస్వి జయహో.
సినీ విశ్వనాథ జయహో

నీ ఓసీత కథ ను విని
ఆ సీతామహాలక్ష్మి కి,
ఉండమ్మా బొట్టు పెడతా అన్న నిండు హృదయాలు ఎన్నో ఎన్నెన్నో

నీ శుభ సంకల్పం సినీ శారదకు జీవనజ్యోతి కాగా! ఆ ఖ్యాతి నీది కాదా?
ఇక నీ జ్ఞాపకాలు నా వ్యాపకాలు
పవిత్రచిత్రనాథ
పునీతవిశ్వనాథ.

అజరామర కీర్తిచంద్రికల కళాకృతుల కళాహృదయమా! నీకివే నీరాజనాలు
కళాయశస్వికి
నా జయహో నినాదాల నివాళులు.

Exit mobile version