Site icon Sanchika

వొగ్గే వాటము

[dropcap]కా[/dropcap]నుగ మాను కవలకొమ్ముల కూకోని ఎకనాదము వాయిస్తా వుండాడు శికలన్న.

అన్న నాదానికి వంతు పాడతా కాకమ్మ, గువ్వమ్మ తమ కూతలని వినిపిస్తా వుంటే… నేనూ తల గుంకాయిస్తా “తాలే లిల్లీయలో శివ తాలే లిల్లీయలో” పాడతా, ఆడతా, గాలిని గూరాడతా వుండా…. అట్ల తబుడు నాలా ఓ సందేహము దూరే.

అట్లే దాన్ని అన్న చెవిలా వేస్తిని.

అంటే “మనకి విశ్వానికి వొగ్గే వాటము ఏమినా?” అంటా.

“గతి (చలనం), మతి (బుద్ది) రా” ఇట్లే అనె అన్న.

“గతి, మతినా, అదెట్లనా… విశ్వంలా గతి మాత్రమే వుంది కాని మనిషిలా గతి, మతి రెండూ వుండాయి కదా?” అంటా నా అనుమానాన్ని అన్న మిందేస్తిని.

“నీ అనుమానానికి నా వంకాయి పెట్టా. మనిషి వుండేది కూడా విశ్వంలానే అనేది మరిస్తివారా, ఆడ వుండేదే ఈడ వుంది, ఈడ వుండేదే ఆడ వుంది. అది తెలుసుకోరా” అనే అన్న.

“ఓ… అవును కదా!” అంటా అన్నకి అనంత విశ్వానికి దండం పెట్టుకొంట్ని.

***

వొగ్గే వాటము = వర్తించే సూత్రము

తబుడు = సమయం

Exit mobile version