Site icon Sanchika

ఓటు-పాశుపతాస్త్రం

[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘ఓటు-పాశుపతాస్త్రం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఓ[/dropcap] ఓటరన్నా!
ఓటుకు నోటు చేటు
ప్రజాస్వామ్యానికి వేటు
సిగ్గులేని, నీతిమాలిన నాయకత్వం
ప్రజలపట్ల కరకు పైశాచికత్వం
ఎవడో ఒకడనుకోకు
నిజాయితీపరుడిని వదులుకోకు
మభ్యపెట్టువారెందరో
బొందలో పడక పోరందుకో
గుర్తించు నిజాన్ని
ఆటకట్టించు విలనిజాన్ని
సాగించవోయి నీ పయనం
నిలపవోయి ప్రజాస్వామ్యం
ఓటుకు విలువ యివ్వు
ప్రభుతకు బలాన్నివ్వు
సంధించు ఓటనే బ్రహ్మాస్త్రం
అది ప్రజాస్వామ్యాన్ని నిలిపే
పాశుపతాస్త్రం

Exit mobile version