వృథా ప్రయాస

1
2

[dropcap]“అ[/dropcap]మ్మా… నాయనా!” అంటూ మాటల్ని సాగదీస్తూ నొప్పులు పడుతున్నాడాయన. వాళ్ళావిడ ఆయన గారి చేతులు, కాళ్ళు రెండు చేతుల్తో ఒత్తుతోంది. ఆయన మందు తాగి.. చెడు తిరుగుళ్ళు తిరిగి నరాల వీక్‌నెస్ రోగంతో మంచం మీద మెలికలు తిరిగిపోతున్నాడు. డాక్టర్లు పరీక్షచేసి పెదవి విరిచారు. ఇంగీషు మందులు పని చెయ్యలేదు. చివరి చూపుగా అన్నట్లు బంధువులందరూ ఒకొక్కరూ చూసి ‘ప్చ్!’ అంటూ పెదవి విరుస్తున్నారు. అంతలో ఆయన కుమారుడి చెవిలో ఎవరో చెప్పారు, అదేదో ఊర్లో నాటుమందు వైద్యం చాలా చక్కగా పని చేస్తుందని. ‘తలిదండ్రలును పూజింపుము’ అన్న సుభాషితాన్ని నమ్మే ఆ కుమారుడు ఆయనకి నాటువైద్యం చేయించాడు. ఫలితంగా చనిపోతాడనుకున్న ఆయన పదిరోజుల్లో లేచి కూర్చున్నాడు. కాదు, కాదు.. లేచి పరిగెత్తాడు. దానికా కుమారుడు సంతోషించాడు. నాటువైద్యుడు ‘మందు మానివెయ్యాల’ని వైద్యం చేసే ముందు షరతు పెట్టాడు. ఆ మాట ‘గాలిదేవుడికి వరంగా’ ఇచ్చేసాడాయన.

మళ్ళీ కొద్ది నెలల్లో ఆయన మంచం పట్టాడు. నాటువైద్యుడి దగ్గరకు తీసుకెళితే తిడతాడని, ఇంగ్లీషు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు. డాక్టర్ పెదవి విరిచాడు. పట్టువదలని విక్రమార్కుడికి మల్లే ఆయన కుమారుడు బ్రతిమిలాడేసరికి.. ఎలాగైతేనేం ఆయన్ని బ్రతికించాడు డాక్టర్. “నరకం అంచుల దాకా వెళ్ళిచ్చాడు మీ ఆయన. ఈసారి తాగితే మావల్ల కాదు” వాళ్ళావిడకి తెగేసి చెప్పేసాడు డాక్టర్. మళ్ళీ మంచం మీదనుండి లెగిసి గుర్రంలా పరిగెత్తాడాయన. అందరూ సంతోషించారు. కాని కొంతకాలానికి ఆయన ఆలోచనల్లో వేగం పెరిగి నదిలో పడిపోయాడు. తన ఇంటికి పెద్ద దిక్కుగా నిల్చుంటాడని కలలు కన్న ఆ కన్నకొడుకు కల కలగానే మిగిలిపోయింది. రెండుసార్లు చావు దగ్గరకెళ్ళిన తన తండ్రిని బ్రతికించేందుకు, తాను ఎన్నో అప్పులు చేసాడు. చివరికి బలవంతంగా చనిపోయి, తనని అప్పుల నరకంలో పడేసి.. ‘వృథా ప్రయాస’నే కానుకగా మిగిల్చాడనే విషయం తల్చుకోగానే తలపట్టుకొని బాధతో కుప్పకూలాడు ఆ కన్నకొడుకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here