నీలి నీడలు – ఖండిక 5: వ్యభిచార వృత్తి

0
4

భక్తి కొఱకయి జారిణుల్ రక్తిగోరి
పురుషులును నిట్లుజేలరేగ కరముగాను
నేరమైయొప్పుచుండునా నీచవృత్తి
అంటురోగంబువోలెను వ్యాప్తిజెందె.(11)

అంత బోకను బురుషులునతివలెంతో
చదువరులునయ్యు, గొప్పవిజ్ఞానులయ్యు
అధమమౌ యిట్టి వృత్తితోనలరుచుండ్రి
కట్టు కథలెన్నా చెప్పుచు గలుషబుద్ధి. (12)

తప్పునొప్పని తాము తగురీతినెఱుగక
జ్ఞానాంధులౌచును జగతియందు
తప్పనుభావంబు దామెఱింగియుగూడ
ఏమౌనులేయని యెంచుచుండి
తప్పదు మాకిట్లు తప్పును జేయంగ
అని సమర్థించుచు నల్పబుద్ధి
తప్పని కూర్చున్న ధనమెట్టులబ్బును
సంసారయానంబు జరుపు కొఱకు
అంచుజనులెల్ల జార్వాకమధికభబంగి
జేయుచును జారగుణమున జెలగుచుండ
శీలమనుమాట కర్ధమీనేలయందు
మాయమయ్యె, లోకమే హేయమయ్యె. (13)

నవనాగరికతయంచును
అవనిని విద్యార్థిలోక మనవరతంబున్
నవనవమౌ ప్రేమలతో
దవినీతను మాటలేకనైక్యంబవరే. (14)

ఇట్టిపనులతోడ నింపైన సంస్కృతిన్
పాడుజేయుచుండ ప్రజలు మిగుల
కలిని సంఘమంత కలుషితంబాయెను
బాగుచేయరాని వ్యాధివోలె. (15)

బాల్యుంపుదశలోనె బాలికామణులను
వేశ్యవాటికలందు విడుచుచుండు
స్త్రీలను బలిమిమై శీలభంగముజేసి
సానికొంపలకును సాగనంపు
మాయమాటలు జెప్పి మానినీమణులను
అరబుదేశము వార్లకమ్ముచుండు
ఆశలు కల్పించి యాడబడుచులబల్మి
పడుపువృత్తిని జేర్చిపాడుజేయ
అట్టి దురవస్థతోడను నధమఫణితి
నలిగి నశియించి కరముగనాశమునకుప
చేరువౌచుండె సతతంబు భారతంబు
ఇంతకన్నను దుర్విధియెందుగలదు? (16)

వ్యాప్తిగాంచెనిట్లు వ్యభిచరింబు గుణంబు
అంటురోగమట్టుల ధికముగను
దేశపు ప్రతిష్ఠ నాశంబునొందగ
భరత జాతి నిష్ఠ భ్రష్టుపడగ. (17)

ధర్మశాస్త్రాల సారమీ ధాత్రియనగ
వాసి నింగాంచినట్టిదౌ భారతమున
భారతీయులు భ్రష్టులై తిరుగుచుండ
దేశమాతకు దఱుగదే దీప్తి సతము. (18)

ఏలవీరలిట్లు హేయమౌమార్గంబు
నెంచుకొనిరో కాని యెఱుగలేము
ఈ ప్రజాళి యరెరె! యిట్టులవర్తింప
జాతికింకగలదే? ఖ్యాతి, ప్రగతి. (19)

ఎందులకిట్టు వీరలిల, హీనపుమార్గమునం జరింతురో
సుందరమైనదేహముల జొక్కిలజేయుచు గామమూర్తులై
మందిర ప్రాభవంబులును మంచిగోల్పడి యెల్లవేళలన్
కొందలమందియేడ్వగను గోడున బంధులు నాలుబిడ్డలున్. (20)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here