Site icon Sanchika

వ్యర్థజీవి కాకుండా

[dropcap]ప[/dropcap]గిలిపోయిన గొట్టమా
పనికిరాని నేస్తమా
నిర్లక్ష్యం చేయబడి
బరువేదో మోపబడి
పగిలిపోయి పెంట పాలైనావు
వ్యర్థపదార్థానివైనావు
నీవు జడపదార్థానివి
నిన్ను నీవు కాపాడుకోలేవు
చైతన్యం గల మానవుడు
తనను తాను బాగు చేసుకోగలిగినా
శ్రద్ధ లేక నిర్లక్ష్యంగా తన పతనానికి తానే
కారణమై చింతలలో కూరుకు పోతున్నాడు
మానవుల చేతలే ఉన్నత స్థితికి గాని
నీచస్థితికి గాని చేరుస్తాయి
నా ఇష్టం నా జీవితం అనకుండా
వ్యర్థజీవిగా కాకుండా సమర్థ జీవిగా
మారాలని ప్రయత్నం చేయలేమా
మన వలన ఇతరులకు
కీడు కలగరాదు ఇదే కదా సమాజ హితవు.

Exit mobile version