పర్యావరణం కథలు-2: వేర్ ఆర్ యు

1
2

[box type=’note’ fontsize=’16’] పర్యావరణం అంటే ఏమిటో, దాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచాలో చెబుతూ బాలబాలికలకి సరళమైన కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]ని[/dropcap]ద్రలేచిన ఏడేళ్ళ స్వీటీకి నిన్న స్కూల్ అసెంబ్లీలో అంకుల్ చెప్పిన మాట ‘మీరందరు పర్యావరణాన్ని శుభ్రంగా క్లీన్‌గా ఉంచాలి’ అన్నది గుర్తుకువచ్చింది.

అంకుల్ చెప్పిన పర్యావరణం అంటే ఏమిటీ, అది ఎక్కడుంది? అని అనుకుంటూ మంచం క్రింద చూసింది. ‘ఛా! బూజు, దుమ్ము’ అని వెళ్ళిపోయింది.

బాత్‌రూమ్‌లో చూసింది. ‘వాసన’ అంది.

పళ్ళు క్లీన్ చేసుకుని, హ్యాండ్ వాష్ చేసుకోవటానికి టాప్ తిప్పింది

చేతిలోకి వస్తున్న నీళ్ళని చూసి ‘ఎక్కడనుండి? ఎలా వస్తున్నాయి. ఎక్కడికి పోతున్నాయి?’ అనుకుని ఆలోచిస్తుంటే “స్వీటీ! వేర్ ఆర్ యు?” అని అమ్మ పిలుస్తుంటే పాలు తాగటానికి పరుగెత్తింది. అమ్మ కూరలు కడుగుతున్నది.

అక్కడ నుండి పర్యావరణం ఎక్కడ? ఎలా వెతకాలి? ఎవర్ని అడగాలి అని ఆలోచిస్తూ ఇంటి నుండి బైటకి వచ్చింది.

ఇంతలో “గుడ్ మార్నింగ్! స్వీటీ!” అంటూ కిట్టి క్యాట్ (పిల్లి) ఎదురువచ్చింది.

“గుడ్ మార్నింగ్! పర్యావరణం ఎక్కడుందో తెలుసా?” అడిగింది స్వీటీ.

“ఎందుకు?”

“క్లీన్ చెయ్యాలి. అంకుల్ చెప్పారు.”

“ఓహ్! నాకు తెలీదు. ఆ fat, big doggy ని అడుగు” అంటూ కిట్టి వెళ్ళిపోయింది చేపను పట్టుకోవటానికి.

స్వీటీ doggy ని వెతుకుతూ వెళ్ళింది. ఇంతలో ఏదో వాసన. ‘ఆ! తెలిసింది. నాన్న సిగరెట్ పొగ’ అనుకుంది.

డాగ్ హౌస్ బైట కూర్చున్న doggy ని పిలిచి, “హేయ్! పర్యావరణం ఎక్కడుందో తెలుసా?” అని అడిగింది.

“తెలీదు” అంది doggy ఆశ్చర్యంగా. “మీ ఇంట్లో నీకు కనపడకపోతే, బహుశా నీకు ఇక్కడ కనపడవచ్చు” అంది కొంటెగా doggy!

“నువ్వు పర్యావరణాన్ని ఎక్కడ వెతుకుతావు?” అంది స్వీటీ.

“ఓహ్. నేను వెతకను.”

“అవునా? మరి పర్యావరణాన్ని చూడకపోతే ఎలా క్లీన్‌గా పెడతావు?”

“నేను వెతకను. ఎందుకంటే నాకు అవసరం లేదు. మనం తిరిగే ప్రతి చోటులో నువ్వు అడిగే పర్యావరణం ఉంది” అంది doggy.

స్వీటీ అన్ని వైపులా తిరిగి చూస్తూ “ఎక్కడుంది?” అని అడిగింది.

“స్వీటీ! స్వీటీ! కంగారుపడకు. కూర్చో.”

చెట్టు కొమ్మని అనుకుని నుంచుని స్వీటీ గుసగుసగా, ఎక్కడ పర్యావరణం పారిపోతుందో అన్నట్లు, “doggy! ఎక్కడ ఉంది?” అని అడిగింది.

“స్వీటీ! గట్టిగా గాలి పీల్చు” అంది doggy .

“ఓకే!” అని గట్టిగా గాలి పీల్చుకుని, “doggy ఇప్పుడు చెప్పు, పర్యావరణం ఎక్కడుందో” అంది.

doggy గాలి పీల్చుకుని “హహ్హ! నువ్వు పీల్చిన గాలి అందులో భాగం. పార్ట్ అఫ్ ఇట్” అంది

“ఏంటి? నేను నా లైఫ్ అంత పర్యావరణాన్ని పీలుస్తున్నానా?” అన్నది గట్టిగా.

తోక ఊపుతూ doggy “అవును. నువ్వు వాటర్ తాగావా?” అడిగింది.

స్వీటీ రిప్లై ఇచ్చేలోగానే, మళ్ళీ “మిల్క్, ఫ్రూట్, ఫుడ్ తిన్నావా?” అని అడిగింది.

“ఆ! మరి నా బెడ్ క్రింద బూజు, డస్ట్, నాన్న సిగరెట్ పొగ ఇవేంటి?” అంది స్వీటీ.

“ఇప్పుడు తెలిసిందా? పర్యావరణం నీ చుట్టూ కనిపించీ కనపడకుండా ఉంది” అంది doggy.

“స్వీటీ నీకు తెలుసా? నువ్వు అడిగే పర్యావరణం మనల్ని బలంగా చేస్తుంది. కొన్ని సార్లు జబ్బు పడేలా చేస్తుంది. పర్యావరణం అంటే గాలి, నీరు, నేల/soil, ఫుడ్ ఇంకా మన చుట్టూ ఉండేవి అన్నీ” అంది doggy.

స్వీటీ కొద్దీ సేపు సైలెంట్ గా ఉండి “నేను పందెం వేస్తా. సూర్యుడు పర్యావరణంలో లేడు” అంది

పెద్దగా నవ్విన doggy  “నీ ముఖం! సూర్యుడు అందరికి బలం ఇస్తాడు. నీకు డి విటమిన్ ఇస్తాడు” అంది.

నుంచుని అన్ని వైపులా తిరిగి చూసిన స్వీటీ “సో! పర్యావరణం/ఎన్విరాన్మెంట్ అన్నిచోట్లా ఉంది అంటావు. స్కై /ఆకాశం, వాటర్ /నీరు, గ్రౌండ్, నా బెడ్ క్రింద” అని అంది.

“అవును. మనం క్లీన్‌గా ఉంచాలంటే మనం చెత్తని ఏది, ఎక్కడ, ఎలా పడేస్తున్నామో గమనించాలి.”

“ఆ! తినేముందు చేతులు కడుక్కోవాలి” అంది స్వీటీ .

“అవును. నీ హాండ్స్‌లా నీ పర్యావరణాన్ని చెత్త చెయ్యకుండా క్లీన్‌గా ఉంచాలి. నీటిలో ప్లాస్టిక్, ఆయిల్ లాంటి చెత్త వెయ్యవద్దు. చెత్తని, సిగరెట్స్‌ని కాల్చి గాలిలో కలపొద్దు” అని doggy ఇంకేదో చెప్పబోతుంటే

“అమ్మో! పర్యావరణాన్ని క్లీన్ చెయ్యాలంటే చాలా పనుంది. ఫ్రెండ్స్‌కి చెప్పాలి. వస్తాను” అని ఇంట్లోకి పరుగెత్తింది.

“అబ్బా! స్వీటీ చాలా మాట్లాడుతుంది. ప్రశ్నలతో విసిగిస్తుంది” అనుకుంటూ doggy తన ఇంట్లోకి వెళ్లి పడుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here