[dropcap]క[/dropcap]వి, అనువాదకుడు, సినీ విమర్శకుడు కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తను జన్మించిన 1958 నుంచి పునర్జన్మను పొందిన 2014 దాకా తన జ్ఞాపకాలను ‘యాదోం కీ బారాత్’ గా రాసారు.
ఆయన రచించిన ‘యాదోం కీ బారాత్’ (జ్ఞాపకాల ఊరేగింపు) పుస్తక ఆవిష్కరణ 18 ఆగస్ట్ 2024 ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో జరుగుతుందని ప్రోజ్ పోయెట్రీ ఫోరం నిర్వాహకులు శ్రీమతి ఇందిరా రాణి ఒక ప్రకటనలో తెలిపారు.
రచయిత తండ్రి గారు గొప్ప ఉపాధ్యాయుడు శ్రీ వారాల అంజయ్య (88) ఆవిష్కరించి తన ముని మనుమడు చి. ప్రద్యుమ్నకు తొలి ప్రతి అందజేస్తారని వివరించారు. ఆ సందర్భంలో సాహితీ వేత్తలు, ఆత్మీయులు, స్నేహితులు హాజరవుతారని ప్రకటనలో వివరించారు.