యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 51 – శ్రీ వీర హనుమాన్ దేవాలయం, రామ సముద్రం

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా రామ సముద్రం లోని శ్రీ వీర హనుమాన్ దేవాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

వీర హనుమాన్ దేవాలయం, రామ సముద్రం

[dropcap]కు[/dropcap]ల శేఖర్ గారిది పూర్వీకుల పురాతన గృహం. దానిని కుల శేఖర్ గారు ఆధునీకరించారు. దానిలో వారు చూపించిన నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా వుండలేక పోయాము. పెద్దలు, వారి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకున్నాము.

వారి మాతృమూర్తి వడ్డించిన కమ్మని భోజనం కడుపారా ఆరగించాము. భోజనం పెట్టటమే కాదండీ. మంచి జాకెట్ బట్ట, పసుపు కుంకాలతో తాంబూలమిచ్చారు. వారి ఆదరణకు హృదయం ఉప్పొంగగా అక్కడనుండి బయల్దేరాము.

ఇక్కడ ఇంకో విశేషం చూశాము. వాళ్ళింటిని ఆనుకునే వున్నది వీర హనుమాన్ దేవాలయం. అక్కడికి తీసుకెళ్ళారు. ముందు చాలా పెద్ద హాలు కనబడ్డది. ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటారేమో అక్కడ అనుకున్నాము. అక్కడ ఆలయం వున్నట్లు తెలియలేదు. లోపలకి వెళ్ళాక ఎడమ చేతి పక్క ఆలయం వీర హనుమాన్‌ది 7 అడుగుల పైన విగ్రహం. నాకు ఆ విగ్రహం చూడగానే వరంగల్ భద్రకాళి అమ్మవారు గుర్చొచ్చారు. అంత పెద్దగా వున్నది.

స్వామి మకర తోరణంలో శంఖు, చక్రాలున్నాయి. ఈయన ఇది వరకు పెరుగుతూ వుండేవారట. అప్పుడు ఎడమ చేయి పైన రెండు రంధ్రాలు చేస్తే పెరగటం ఆగిందట. ఆ రంద్రాలను చూపించి ఆ విషయం చెప్పారు.

ప్రతి మంగళ వారం ప్రత్యేక పూజలు, ఇంకా హనుమజ్జయంతి, శ్రీ రామ నవమి వంటివి వైభవంగా జరిపిస్తారుట.

150 సంవత్సరాల క్రితం వారి తాతల కాలంలో వారు సంతానం కనగక పోతే రావి మొక్క నాటి, నాగ ప్రతిష్ఠ చేశారుట. ఇప్పుడా చెట్టు మొదలు విగ్రహాన్ని కప్పేస్తూ పెరిగింది. చాలా పెద్ద వృక్షం. ఇంకా కొందరు భక్తులు, కుల శేఖర్ గారు చేసిన నాగ ప్రతిష్ఠలు కూడా చూపించారు.

రామ సముద్రం లోనే ఇంకా చాలా పురాతన ఆలయాలు వున్నాయని, వాటిలో ముఖ్యమైన వాటిని చూపిస్తామన్నారు కుల శేఖర్ గారు. మాకు మృష్టాన్న భోజనంకన్నా ఎక్కువ అన్నమాట. సంతోషంగా బయల్దేరాము.

వచ్చే వారం ఊరు కన్నా ముందే వెలిసిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం గురించి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here