[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా రామసముద్రం లోని వాలీశ్వరస్వామి ఆలయం, సోమేశ్వరాలయం, మినికి లోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
53. వాలీశ్వరస్వామి ఆలయం, రామ సముద్రం
[dropcap]ఈ[/dropcap] ఆలయం పెద్ద కొండ మీద వుంటుంది. 7 కి.మీ.లు కొండపైకి ఎక్కాలి. మెట్లు లేవు. ఇది త్రేతాయుగంలో వాలి ప్రతిష్ఠ అంటారు. అంత శ్రమ పడి పైకి వెళ్ళలేని వారికోసం రామ సముద్రంలో వాలీశ్వరస్వామి ఆలయం కట్టించారు. 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది. ఆలయం శిధిలమవుతున్న సమయంలో నారాయణస్వామి అనే ఆయన పునర్నిర్మాణం చేయించారు. అమ్మవారు పార్వతి.
54. సోమేశ్వరాలయం, రామసముద్రం
ఇది పుంగనూరు జమీందారు కట్టించిన ఆలయం. చంద్రశేఖరస్వామి, భీమగానిపల్లె, భీమవాని పాలెం, చౌడేశ్వరపల్లి, మృత్యుంజయేశ్వరుడు, ఈ ఆలయం ఒకేసారి నిర్మించారుట 400 సంవత్సరాల క్రితం. ఉపాలయాలలో వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. వంశపారంపర్య అర్చకులు శ్రీకంఠప్ప దీక్షితులు, పుత్రులు.
55. కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, మినికి.
ఈ ఆలయం రామసముద్రంనుంచి 4కి.మీ. ల దూరంలో వుంది. ఈ జిల్లాలో పాండవ గుహలు ఎక్కువ. ఈ చుట్టుపక్కల 5 పాండవ గుహలు వున్నాయి. ఇవి పంచ పాండవులవి అంటారు. ఆలయంలోనే ఒకటి కొంచెం పెద్దది వున్నది. దాని మీద కప్పు చాలా పెద్ద బండరాయి వున్నది. అది భీముడిదిట. ఆ రాయిని మోయగలిగింది ఆయన ఒక్కడేగనుక. మిగతావారివి ఆలయానికి కొంచెం దూరంలో వున్నాయి.
ఇక్కడ అర్చక స్వామి చెప్పిన కథ ప్రకారం పుంగనూరు దొరగారి కూతురికి ఎంత కాలానికీ వివాహం కాకపోతే, ఒక జ్యోతిష్కుడు మూడు వైష్ణవ ఆలయాలు ఒకేసారి నిర్మిస్తే వివాహం అవుతుంది అన్నారుట. మినికి, పుంగనూరు, రామసముద్రంలో ఒకేసారి ఆలయాలు నిర్మించారుట. ఆ అమ్మాయి వివాహం జరిగిందిట.
స్వామికి సాలిగ్రామాల పెద్ద మాల వేశారు. చూపించారు. ఒకటి లక్ష్మీనరసింహస్వామిది, ఇంకొకటి విష్ణువుది. అలా వున్నాయి.
ఇవాళ్టికి యాత్ర పూర్తయింది. దీనికి ముందు చూసిన మూగవాడి గురించి వచ్చే వారం.