Site icon Sanchika

యుద్ధం అనివార్యం!

[dropcap]యు[/dropcap]ద్ధం అనివార్యం అని తెలిసినప్పుడు

యుద్ధం చేయవలసిందే!

ఒక్క అడుగు వెనక్కి వేస్తే అంతే

ప్రత్యర్థి..

ఓటమి అంచులకు చేరేవరకు తరిమి

మృత్యురూపంలో అగుపిస్తూ జీవితాన్ని అంతం చేస్తుంది!

ఇప్పుడు కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరులో

తెలిసో తెలియకో

మనం ప్రతి ఒక్కరం ప్రత్యక్షంగానో, పరోక్షం గానో యుద్ధం చేస్తున్నాం!

ఈ యుద్ధంలో ప్రత్యర్థి కరోనా..

మనిషికి కనిపించకుడా..

దాని ఉనికే మనిషి కనిపెట్టలేనంత చాటుగా వుంటూ..

దొంగదెబ్బ తీస్తుంది..!

మానవ జీవితాలని చిన్నాభిన్నం చేస్తూ

మానవాళి మనుగడనే శాసిస్తూ

అవని అంతటా విస్తరిస్తూ అంతుచిక్కని ప్రశ్నై వేధిస్తుంది!

పేద గొప్ప తారతమ్యం లేకుండా

వెంటాడుతూ..

చిక్కినవాళ్ళని చిక్కినట్లుగా ప్రాణాలతో చెలగాటమాడుతుంది!

ఈ మహమ్మారితో యుద్ధం చేయడమంటే..

బాహాబాహీ తలపడవలసిన అవసరమేమీలేదు..

స్వీయనియంత్రణ..

తరచుగా చేతులు కడుక్కోవడం..

అవసరమైతే తప్పబయటకు వెళ్ళకుండా..

ఇంటిపట్టునే వుండడం!

ఇప్పుడు చేయవలసింది

ఒకే ఒక్కటి

చేయిచేయి కలపకుండానే

మనమంతా ఒక్కమాటమీదకొద్దాం!

ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తూచాతప్పకుండా

పాటిస్తూ ఈ మహమ్మారిని అంతం చేద్దాం!

కోల్పోయిన శక్తినంతా తిరిగితెచ్చుకుని

మానవజాతికి స్ఫూర్తి ని నింపుతూ

మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుంటూ

అతి తొందరలోనే కరోనారహిత

చైతన్యవంతమైన నూతన సమాజాన్ని సృష్టిద్దాం!

Exit mobile version