యువభారతి సంస్థ తలపెట్టిన ‘తెలుగు వెలుగు’ సమాఖ్య కార్యక్రమాలు – ప్రకటన

0
58

ప్రస్తుత సమాజంలో‌ తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికై జంటనగరాలలో పేరెన్నిక గన్న సాహితీ సంస్థలతో కలసి ఒక సమాఖ్యగా ఏర్పడి, సంవత్సరం పాటు నెలనెలా ఒక సంస్థతో కూడి ‘తెలుగు వెలుగు’ సమాఖ్య సమావేశాలను ఏర్పాటు చేయాలని ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థ సంకల్పించింది.

నవంబర్ 2024 నెల, 3వ తేదీ (ఆదివారం) నాడు సాయంత్రం 6 గంటలకు లక్డీకాపూల్ వద్ద గల ఐ.ఐ.ఎం.సి. కళాశాల ఆడిటోరియంలో ఈ ‘తెలుగు వెలుగు’ సమాఖ్య యొక్క మొదటి సమావేశాన్ని ‘వంశీ ఇంటర్నేషనల్’ మరియు ‘యువభారతి’ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

ఈ మొదటి సమావేశానికి డా. కె.వి. రమణాచారి గారు (విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి, తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు) ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ ‘తెలుగు వెలుగు’ సమాఖ్య కార్యక్రమాలను ప్రారంభం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు, తెలుగు భాషా సాహిత్యాల పట్టభద్ర మరియు స్నాతకోత్తర విద్యార్థులు మరియు తెలుగు సాహిత్యకారులు, సాహిత్యాభిమానులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాలను విశేషంగా జయప్రదం అయ్యేందుకు సహకరించి, తద్వారా జంట నగరాలలో తెలుగు భాషా, సాహిత్యాల వ్యాప్తికి తోడ్పడగలరని మా విజ్ఞప్తి!

–  డా. ఆచార్య ఫణీంద్ర

అధ్యక్షులు, యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, హైదరాబాదు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here