15. బాటసారి

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]నే[/dropcap]నొక దారి తెలియని బహుదూరపుబాటసారిని
నా దారిలో వెన్నెల రాత్రులు ఉన్నాయి
ఎండమావులు ఉన్నాయి.
ఎండమావులు దాటి, వెన్నెల రాత్రులను చేరేదేపుడో,
ఆమె కోసం ఈ నిరీక్షణలో ముళ్ల పొదలనుండి
పూవుల దారి చేసాను. కాని ఆమెకు ముళ్ల పొదలే
కనబడుతున్నాయి.
నా పువ్వుల దారి చూసేదెపుడో
ఆమె నన్ను, చేరుకునే దెపుడో, ఈ నిరీక్షణలో ఎటు
వెళుతున్నానో తెలియని బాటసారిని నేను
నా నిరీక్షణ ఫలించేనా నాకు దారి
దొరికేనా నా దారిలో నీవు పయనించేవా
నా ప్రయాణంలో నాకు తోడు ఉంటావని,
నా దారిలో పయనిస్తావని నేను ఎదురు చూస్తున్నా
ఈప్రయాణంలో కలిగే ఒడిదుడుకులను
నీపాదాల సవ్వడిలో మరచి పోవాలని నన్ను
నన్నుగా కోరుకుంటూ నాదారిలో నీవు నడుస్తావని
నా జీవన గమ్యాన్ని మారుస్తావని
ఆశించే నీ బాహుదూరపు బాటసారి.