2. బంగారు భవిత

0
6

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో సంచిక సంపాదకవర్గం వారి ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత. [/box]

[dropcap]ఒ[/dropcap]క్క దెబ్బకే వంగిపోయిన మేకులు
మోసాలకు లొంగిపోయిన లోకులు
వలలో చిక్కుకున్న పక్షులు
ఎరకు ఆశ పడిన చేపల వలె
కరక్కాయల మోసాలకు
చెంబులు మార్చే దొంగబాబాల
ద్రోహాలకు గురైపోయి
ధనం కోల్పోయిన లోభులు
తలలు బాదుకున్న ఏడ్పులు
ఈమధ్య విన్నావటోయ్ వీరభద్రం
వంగిపోయిన మేకులు వ్యవహారానికి
పనికిరావు కష్ట నష్టాలకు కృంగిపోయినవారు
వారి భవితకే ఉపయోగపడరు
తట్టుకుని నిలవగలిగిన వారే ధీరులు,వీరులు
వీరు పరోపకార పనిమంతులు
దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం
అదే మనోబలం కావాలి యువకుల్లో
అన్నారు స్వామి వివేకానంద
నిజాయితీ పెంచుకుని నిరుపయోగం కాకుండా
నిండుకుండలా నిలవాలి యువత
అప్పుడే దేశానికి బంగారు భవిత.