35. రాఖీ

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]చి[/dropcap]న్ననాటి నా నేస్తమా…..!
మదినల్లుకున్న బంధమా….!

అడుగడుగునా నీ జ్ఞాపకాల
అలజడిలో నింపావు….
అందుకోలేనంత ఎత్తులో
నువ్వు జాబిలివయ్యావు….!

అక్క పంపే రాఖీలన్నీ
లెక్కకు మించుతున్నాయి….
అవి నీ పక్కన చేరేందుకు
చుక్కలవుతున్నాయి….!

ఎన్నని తలచుకోను
చిన్న నాటి నీ అల్లర్లు….
ఎన్నని కార్చను
నువ్వు లేవని కన్నీళ్ళు….!

ఏ ఊరో వెళ్ళావనుకుంటోంది మనసు….
ఏ పూట నువ్వు రావని తెలిసీ…..!

నీ మాటే వినాలనుకుంటుంది మనసు….
నీ స్వరం మూగబోయిందని మరచి….!

దూరమయ్యేందుకేనా
అందరికీ అంత దగ్గరయ్యావ్…..
చేరువయినందుకేనా
అప్పుడే దూరమయిపోయావ్….!

మబ్బుల్లో దాగిన
నా చందమామకి(తమ్ముడికి)
రాఖీ శుభాకాంక్షలు….!!