[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో పాఠకుల ఓట్ల ఆధారంగా ఎంపికైన తృతీయ ఉత్తమ కవిత. [/box]
[dropcap]స్వ[/dropcap]ప్నమో ఏమో
తెలియదు…….. నీ రాక…..
మల్లెల వాగులో
వెన్నెల పడవలా ఉంటోంది….!
తడి రెప్పలను తాకిన
నీ స్పర్శ
కల అయిన అద్భుతమే …..
రాలిన పొగడపూలలా సున్నితంగా…..!
సంగీత లయను పోలిన
ఏదో ఓ తీయని సడి
అది నీదే ఏమో ….
ఇంకా వినిపిస్తోంది మెలకువలోనూ….
నను వీడనంటూ…..!
మదికెంత ఊరటో
విరిగిన మమతల గూడును
మళ్ళీ అల్లుకుంటోంది….!
ఇప్పుడు అధరాలపై
ఓ కమ్మని చిరుహాసం
నేను రాసే కవితల కన్నా
మధురంగా….. !
ఓ స్నేహమా….!
ఇది కలే కదూ…!
చూడు నా కళ్ళెంత మురిసిపోతున్నాయో…. నీపాద స్పర్శను అనుభూతిస్తూ ….!
నడిచిరావా ప్రతిరేయీ….
నా స్వప్నాల సౌధం లోకి…..
నాకే వినిపించే
అడుగుల సవ్వడితో…..!!