41. స్నేహం…

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]అం[/dropcap]దం చూసి చేసే స్నేహం
కర్పూరంలా కరిగిపోతుంది….!

ఐశ్వర్యం చూసి చేసే స్నేహం
నిప్పై కాలుస్తుంది ….!

పదవిని చూసి చేసే స్నేహం
వాడుకుని వదిలేస్తుంది ….

మతం ముసుగులో స్నేహం
ద్వేషాన్ని రగులుస్తుంది ….!

ప్రతిభను చూసి చేసే స్నేహం
నైపుణ్యాలను పెంచుతుంది….!

కానీ….!

మనసును చూసి చేసే స్నేహం
చీకటి కమ్మిన క్షణాలన్నింటిలో
వెన్నెల వెలుగులు కురిపిస్తుంది ….!

అమ్మలాంటి ఆత్మీయ స్పర్శతో
సేదతీరుస్తుంది….!

నాన్న లాగా తప్పులను సరి చేస్తుంది….!

జీవితాంతం మొగలి పరిమళంలా
గుభాళిస్తూనే ఉంటుంది….!!