47. రావయ్యా రావయ్యా మరొక్కసారి

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]బా[/dropcap]పూ, నే చెప్పేది వింటావా
నీ దేశం ప్రగతి తెలుసుకుంటావా
పెరిగిపోతున్నాయయ్యా పెరిగిపోతున్నాయి
పగలు, ప్రతీకారాలు
కక్షలు, కార్పణ్యాలు
ద్వేషాలు, విద్వేషాలు
ఆరోపణలు, ప్రత్యారోపణలు
దొంగతనాలు, దోపిడీలు
హత్యలు, అత్యాచారాలు
పెచ్చరిల్లుతున్నాయయ్యా పెచ్చరిల్లుతున్నాయి
మానభంగాలు, భ్రూణహత్యలు
కులమతద్వేషాలు, జాతిద్రోహాలు
పదవీ పోరాటాలు, రాజకీయ ఆరాటాలు
మానవహక్కుల భంగాలు, యధేచ్చగా ఉల్లంఘనలు
అమ్మాయిల, అమాయకుల ధన మాన హరణాలు
ఉగ్రవాదుల దుశ్చర్యలు, దొంగచాటు దాడులు
ఎవరాపగలరు బాపూ, వీటన్నింటినీ,
ఏరీ నాటి మహానాయకులు, మార్గదర్శకులు
ఏరీ నాటి త్యాగధనులు, నిస్వార్ధపరులు
ఏరీ నాటి మహాత్ములు, మహానుభావులు
ఏరీ నాటి ఆదర్శపురుషులు, రాజకీయ దురంధరులు
ఏరీ నాటి లోకమాన్యులు, లోకనాయకులు
ఏరీ నాటి ఉక్కుమనషులు, హక్కుల రక్షకులు
లేరయ్యా లేరు, ఎవరూ లేరు
ఉన్నా కానరారు, బయటికి రారు, రాలేరు
అందుకే నిన్నడుగుతున్నా
రావయ్యా రావయ్యా నీవైనా మరొక్కసారి
రక్షించవయ్యా నీ భారతావనిని మరోసారి