55. క్షణికావేశం

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ఒ[/dropcap]క్కసారి ఆలోచించనే లేదు!
రెండు నిముషాలో, మూడు క్షణాలో చుట్టూ చూడలేదు.
ఆలోచించలేని మెదడు ఆజ్ఞపించిందా? నేన్నమ్మను!
పుర్రె పగలగొట్టి చూసి రక్తం లేదనేసారు!
ఓటమి సుర్యాస్తమయం,
ఆకలి ఎండాకాలంలో ఎండిపోయిన చెరువు
ఆవమానం ఉచ్ఛ్వాస,
ప్రేమ పిచ్చి అర్థం లేని పదం,
వేధింపు, చూపిస్తున్న చూపుడు వేలు,
మందలింపు స్టార్ట్ బటన్ ప్రెస్సింగు,
జబ్బు పక్క స్పేషన్లో ఉన్న రైలు.
చావురానితనం లోపలున్న బతుకుని గెలవనే లేదు!
ఖాళీ పాత్రలో మెతుకుందేమో చూడనేలేదు,
క్షమ చొక్కాకి చిరునవ్వు బొత్తాము పెట్టనే లేదు,
బతుకు నిఘంటువు తిరగేసి ఏ అర్థం వెతకనేలేదు,
కుక్క జీవిత కాలం ఆరుస్తూనే, కూర్చోదు!
చెరకుగడవేం కాదు, మిషన్లో దూరిపోడానికి!
చూడ్డానికి రాలేవు గానీ,
బాధ పురుగు తల్లి వేరుని దొలిచేసింది!
కాండం నిటారుగా ఉన్నా లోలోపల డొల్లయిపోయింది.
ప్రకృతి ధర్మం కొసం నిల్చున్నట్టుంది గానీ, చనిపోయింది తెలిసా?
తొడిమ నుండి ఊడి పడడానికి వంద మార్గాలుంటే,
పుష్పంచి, పిందై, కాయై, పండవడానికి కోటి దారులున్నాయి.!
తూచ్! అని చెట్టెక్కడానికి మాత్రం మరి ఏ మార్గం లేదు!
ఓడిపోడానికి తపనే గాని, గెలిచిందేం కనబడలేదు!
కాళ్ళున్న చోట నిలకడలేక గిలగిల తన్నుకున్నావు,
కాళ్ళు నిలవని చోటుకెళ్ళి ఏం సాధిస్తావు?
ఆలోచనే పాలక నేత! ఎన్నుకోడం తెలియాలి!!