6. చినుకు-చిగురు

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ని[/dropcap]శ్చల వార్నిధి కురిసెను ఇల పయోనిధిపై
ఈ పరస్పర వినిమయం నిరర్థకం
పైగా దీనికి ప్రత్యక్షభగవానుడే పరోక్షకారకుడు
తన తపనకి తాపానికి నీటిని ఆవిరి చేసి మేఘదాహాన్ని తీరుస్తాడు
నీటిభారం పెరిగిన మేఘుడు వర్షాకాలమునకై వేచి చూస్తాడు
వేసవి గతిస్తుంది… కాలం స్వాతిచినుకును స్వాగతిస్తుంది
మేఘుడు వదిలిన వరుణుడు సస్యముపై పడితే కృషీవలుడు చేసిన సేద్యం, కార్చిన స్వేదం సార్థకం అవుతాయి
అలా కాకుండా ఏ సముద్రం పైనో అగాధంలోనో పడితే ???
అవసరం ఉన్న చోట నేలని తడిపితే ప్రయోజనం
…’పయో’జనం….!!!!
అలా కాకుండా వర్షం దాని అవసరం లేని చోట కురిస్తే ఉ’పయో’గం ఏముంటుంది?
తనలో ఉన్న నీటినే సముద్రంపై కురిపిస్తే మేఘం గొప్పదనమేముంది?
ఎవరికైనా వాళ్ళ దగ్గర లేనిదాన్నిస్తేనే సంతోషపడతారు…ఉన్నదే ఇస్తే …ఏంటి ప్రయోజనం?
కడుపు నిండిన వాడి ముందు పంచభక్ష్యాదులు ఉంచినా కూడా ఏం లాభం?
అదే ఆకలితో ఉన్నవాడికి ఇస్తే
వాడి క్షుధలో సుధ పోసినట్టవుతుంది!!!!
అసలు ముందు వాడికి ఆకలిగా ఉంది మనం గుర్తిస్తేనే కదా అన్నం పెట్టేది…ఒకవేళ గుర్తించకపోతే తప్పు కళ్ళది అవుతుంది…గుర్తించినా పెట్టకపోతే మనసుదౌతుంది
అలాగే వర్ష ఆవశ్యకతను గుర్తించాల్సింది దాని కళ్ళు కాదు మేఘం యొక్క మనసు!!!!
ఎందుకంటే మేఘం ఎక్కడైతే ఆగి తనని జారవిడుస్తుందో అక్కడే అది కురుస్తుంది!!!
వృష్టి వస్తే సరిపోదు…అనర్థాలు తెచ్చే అతివృష్టి రాకూడదు..అస్సలు రాని అనావృష్టి అసలే కాకూడదు…తగు వేళ తగినంతగా కురిసి వసుధపై సుధలు చిలికించాలి…క్షితి క్షితిజములతో పులకించాలి!!!