[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]’అ[/dropcap]నాథ’
ఆ పేరు విన్నా.. పేపరులో ఆ పదం చూసినా.. నా మనస్సు ఎప్పుడైనా సరే ఎంతో ఆందోళనకు గురవుతుంది.
నేను కూర్చున్న కుర్చీలోంచి అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. న్యూస్ పేపర్లోని ఓ ఆర్టికల్ టైటిల్..
“అనాథలైన ఓ వృద్ద జంట.. స్పృహ కోల్పోయిన స్థితిలో రైల్వే ట్రాక్ ప్రక్కన..”
ఇంక ఆ ఆర్టికల్.. ఆ న్యూస్ చదవలేదు. నిజానికి చదవాలనిపించలేదు.
ఎ.సి. చల్లగా వుంది. రూమంతా హాయైన వాతావరణం.. కిటికీ లోంచి బయటకు చూస్తుంటే.. పచ్చని ప్రకృతి అందాలు..
పేపరు చేతిలోకి తీసుకున్నాను.. చదువుదామని! ఫొటో స్పష్టంగా వుంది… ఆ దంపతుల ఫొటో చూస్తుండి పోయాను!
నా ఆలోచనల్లో వివిధ సంఘటనలు.. ఒక దాని వెంట ఒకటి.. కదలడానికి సిద్ధంగా వున్నాయి..
నా ఆలోచనలని డిస్త్రబ్ చేస్తూ..
“డా. సాయినాధ్! మే ఐ కమిన్…” డా. శివకేశవ్ పిలుస్తుంటే..
“ఎస్. కమిన్” అన్నాను..
నా యెదురుగా కూర్చున్నాడు.. ఆ రోజు ఆదివారం.. నేనైతే.. ఆరోజు కూడా హాస్పటల్‌లో వుంటాను… పేషంట్స్‌ని గమనించుకుంటూ.. సాయంత్రం ఐదు గంటలకు వచ్చి.. ఓ గంటసేపు మాత్రమే వుండి వెళతాడు కేశవ్.
ఇద్దరికీ ‘రా ‘ అని పిలుచుకునేంత చనువు..
మేమిద్దరం హాస్పిటల్‌లో డాక్టర్స్‌గా ఒకేసారి చేరడం.. అందునా ఒకే మెడికల్ కాలేజ్ నుండి ఎం.బి.బి.స్ పట్టా పుచ్చుకున్నాం ..
“సర్లేరా!.. కేస్‌లు ఏమీలేవు కదా.. అలా ఒకసారి బయటకు వెళదామా..? ప్రభాకర్ వున్నాడు కదా.. ఎవరైనా పేషంట్స్ వస్తే చూడడానికి..” అన్నాడు.
మాములుగా అయితే బయలుదేరేవాడిని.. కాని న్యూస్‌పేపర్‌లో వచ్చిన.. ఫొటో చూసినప్పటి నుండి మనసంతా ఏదోలా వుంది..
“నేను రావడం లేదు లేరా” అన్నాను.
“సర్లేరా ..సీ యూ బై!” అంటూ కేశవ్ వెళ్ళిపోయాడు..
రూములో మళ్ళీ నన్ను పలకరించింది నా ఒంటరితనం.. అప్పుడప్పుడూ.. ఆ ఒంటరితనమే నాకు తోడుగా.. ఆలోచనలు గతంలోకి దారితీసాయి.
మా వూరు రామాపురం.. జిల్లా కేంద్రానికి చాలా దూరంలో వుంటుంది. అక్కడే నేను 5th క్లాస్ వరకు చదువుకున్నాను. నన్ను నాన్న 6th క్లాస్ సాంఘిక హాస్టల్ లో చేర్చాక కాని.. మా వూరికంటే ఎంతో పెద్ద ఊళ్ళు ఉన్నయని తెలియదు.
నేను 6th క్లాస్ హాస్టల్ లో వుండి చదువుకుంటున్న రోజులలో.. నాన్న ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు..
“అమ్మ రాలేదేంటి?” నాన్నని ప్రశ్నించాను. వెంటనే ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. నా నోటికి స్వీటు అందించారు.
‘ఎందుకు’ నేను ప్రశ్నించ లేకపోయాను.
“అదీ.. నీకు తమ్ముడు పుట్టాడురా” అన్నాడు. నేను ఒక్కసారిగా నాన్నని పట్టుకుని.. “అవునా! మరైతే అమ్మని కూడా తీసుకుని వస్తే.. తమ్ముడిని చూసే వాడిని కదా!” అమాయకంగా అడుగుతున్న నాకెలా సమాధానం చెప్పలో నాన్నకి అర్ధం కానట్లు వుంది.
“అమ్మ.. హాస్పటల్‌లో వుందిరా” అన్నాడు .
“మరైతే.. నాకు.. అమ్మనీ, తమ్ముడినీ చూడాలని వుంది. నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళు…” కొద్దిగా మారాం చేసాను.
“ఈసారి వచ్చినప్పుడు తీసుకువెళతాను.. సరేనా?” అన్నాడు.
“అంటే రెండు రోజుల తరువాత వస్తావా?”
“దసరాకి వచ్చి తీసుకు వెళతాను. అప్పుడు నీకు వారం రోజులు సెలవులు వుంటాయి కదా!”
అంటే.. లెక్కలు వేసుకున్నను.. మనస్సులోనే .. ఇంకా ముప్పయి రొజుల సమయం వుంది .
“నెల తరువాత వస్తావా నాన్నా?” ప్రశ్నించాను. అవున్రా అన్నట్లుగా తలూపాడు.
అప్పుడప్పుడూ అమ్మ, నాన్న.. తమ్ముడిని తీసుకుని నా దగ్గరకి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషమనిపించేది. రోజులు అలా అలా గడిచిపోతుండేవి.
నేను 8th క్లాస్‌లో వుండగా.. నాన్న ఓ రోజు నాదగ్గరకి వచ్చారు. నాకు కాస్త ఊహ తెలిసింది అప్పట్లోనే …
నాకు తమ్ముడో, చెల్లాయో .. రాబోతున్నారని తెలిసింది.
“అమ్మాయి పుట్టిందిరా..”
“ఎ హే.. నాకు చెల్లాయి పుట్టిందోచ్..” అనుకుని సంబరపడ్డాను. నా టెంత్ క్లాస్ పూర్తయింది. ఇక నేను ఇంటికి వెళ్ళిపోయి.. ఆనందంగా కాలేజ్‌కి వెళ్ళి చదువుకోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే.. తమ్ముడూ చెల్లాయి పెరుగుతున్నారు. వాళ్ళతో కలసి ఆడుతూ పాడుతూ.. ఇంటి దగ్గర ఎంజాయ్‌గా వుండొచ్చు అనుకున్నాను!
***
ఇంటర్మీడియట్.. నన్ను సంక్షేమ జూనియర్ కాలేజ్‌లో చేర్చాలనుకున్నట్లు.. అందుకు తగిన ప్రణాళిక నాన్న చేస్తున్నారని తెలిసింది. అమ్మని అడిగాను..”అవును” అని చెప్పింది.
“వద్దు.. నేను ఇంటిదగ్గరే వుండి.. కాలేజ్‌కి రోజూ వెళ్ళి వస్తాను” అన్నాను. అమ్మ నవ్వింది. నాన్న నా మాట వినకపోయినా.. అమ్మ నచ్చచెబుతుందని నమ్మకం.
నేను జూనియర్ కాలేజ్ చదవదానికి హాస్టల్‌లో జాయిన్ అయ్యాను.
ఓ రోజు.. నాకు తెలిసిన ఓ విషయం.. నా కాళ్ళ కింద భూమి కదలినట్లుగా అనిపించింది.