[dropcap]వి[/dropcap]విధ దేశాల విద్యార్థులు చదువుతున్న, ఆంగ్ల మాధ్యమ, కాలేజిలో నేను తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజులు.
భాషాదినోత్సవం రోజున విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ “ఇవాళ మీకిష్టమైన భాష గురించి చెప్పండి” అన్నాను.
“ఐ లైక్ టెల్గు” ఉగాండా క్రిష్టియానా ముద్దు పలుకులు.
“కన్నడ భాష తేలికగా నేర్చుకోవచ్చు” కన్నడిగ స్నేహ ఉవాచ.
“అన్ని భాషలకీ మూలం తమిళ్” తమిళమ్మాయి సెల్వి అభిప్రాయం.
“నేను మాట్లాడుతునా?” శ్రీలంక నివాసి ప్రియంవద మాటలకి క్లాసంతా కిసుక్కుమంది.
‘తప్పు!’ క్లాసుని గదిమి మాట్లాడమన్నాను.
‘పీపుల్‌ని కలుపును భాష. తెల్గు భాష పీపుల్ ఫ్రెండ్లీ. నేను తెల్గు లైక్ చేస్తును. నేరుస్తును’ తన యాసతో, అప్పుడే నేర్చుకుంటున్న తెలుగులో, ప్రియంవద పలికిన పలుకులకి క్లాసంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది.
కాలేజీ వార్షికోత్సవంలో, ప్రియంవద, వక్తృత్వ పోటీలలో ప్రత్యేక బహుమతి గెలుచుకోవడం ఎవరూ ఊహించని విశేషం!
దేశభాషలందు తెలుగు లెస్స అని ఊరికే అన్నారా మరి!