‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
పదసంచిక-2
ఆధారాలు:
అడ్డం: |
1. మిష్టర్ పెళ్ళామ్ చిత్రంలో ప్రేక్షకాదరణ పొందిన గుండు సుదర్శన్ డైలాగు. (2,4) |
4. ఇది మెలిపెడితే సీరాముడు నువ్వేనయ్యా! సైసై నారపరెడ్డీ! నీ పేరే బంగారు కడ్డీరా!! అంటారు విద్వాన్ విశ్వం తమ పెన్నేటి పాటలో. (4) |
7. పవిత్ర లోకేష్ ధరించిన వజ్రాయుధం (2) |
8. చేతితో తాకి చిలుకను చూడు. (2) |
9. భారతదేశంలో వర్తక వాణిజ్యాలు నెరపడానికి 1600లో ఏర్పడిన బ్రిటిష్ సంస్థ. (4,3) |
11. ఆజ్ఞ (3) |
13. సహాయము అనే అర్థంలో వాడబడే జంటపదము. (5) |
14. నా మాతృభూమి. (5) |
15. ఎరుపు రంగు. ఒక కులం కూడా. (3) |
18. మన గ్రామరు. మామిడి వెంకటార్యులు వ్రాసింది. రెండవ అక్షరం మొదటికి వచ్చింది. (3,4) |
19. కాబాలో కాహళం (2) |
21. చిత్రకారుడి పనిముట్టు (2) |
22. నిజ వాసములో సూర్యుడిని వెదుకు. (4) |
23. రామాయణ విషవృక్షం, ఇదండీ మహాభారతం తర్వాత ఏం చెబుతున్నాయి వేదాలు? అనే పుస్తకం ద్వారా విమర్శలను ఎదుర్కొంటున్న రచయిత్రి. (6) |
నిలువు: |
1. దొంగరి మల్లయ్య ఇంటిపేరుగా మారిన నవల.(4) |
2. వితావితంలో పరిమళము (2) |
3. నరకయాతన వంటిదే (5) |
5. తోమీ తోమీ తమరితో (2) |
6. కండోలెన్స్ మెస్సేజి. (3,3) |
9. డి.యోగానంద్ దర్శకత్వంలో 1975లో వెలువడిన మురళీమోహన్ సినిమా. (1,2,4) |
10. సంచికలో కస్తూరి మురళీకృష్ణ వ్రాస్తున్న ధారావాహిక. (4,3) |
11 ఆలుగడ్డ చివర కోల్పోయి ఉడుమును పోలిన జంతువుగా మారింది.. (3) |
12. గజిబిజి అయిన సిపాయి చిన్నయ్య సినిమా హీరోయిన్. (3) |
13. ____ ___ ఆవు పాలకోవా. విందుగా పసందుగా ప్రేమనందుకోవా అని రుణానుబంధం సినిమాలో ఎస్.జానకి స్వరవిన్యాసం. (4,2) |
16. ఏడుకొండల వానితో కుబేరుడు చేసింది. (2,3) |
17. ఒకానొక క్రీడ. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇదే పేరుతో ఒక సినిమా తీశాడు. (4) |
20. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన గ్రామము. (2) |
21. ఒక తిట్టు. దౌర్భాగ్యుడు. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను మే 28వ తేదీలోగా puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 2వ తేదీన వెలువడతాయి.