పదసంచిక-2

0
9

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

పదసంచిక-2

ఆధారాలు:

అడ్డం:
1.  మిష్టర్ పెళ్ళామ్ చిత్రంలో ప్రేక్షకాదరణ పొందిన గుండు సుదర్శన్ డైలాగు. (2,4)
4. ఇది మెలిపెడితే సీరాముడు నువ్వేనయ్యా! సైసై నారపరెడ్డీ! నీ పేరే బంగారు కడ్డీరా!! అంటారు విద్వాన్ విశ్వం తమ పెన్నేటి పాటలో. (4)
7. పవిత్ర లోకేష్  ధరించిన వజ్రాయుధం (2)
8. చేతితో తాకి చిలుకను చూడు. (2)
9. భారతదేశంలో వర్తక వాణిజ్యాలు నెరపడానికి 1600లో ఏర్పడిన బ్రిటిష్ సంస్థ. (4,3)
11. ఆజ్ఞ (3)
13. సహాయము అనే అర్థంలో వాడబడే జంటపదము. (5)
14. నా మాతృభూమి. (5)
15. ఎరుపు రంగు. ఒక కులం కూడా. (3)
18. మన గ్రామరు. మామిడి వెంకటార్యులు వ్రాసింది. రెండవ అక్షరం మొదటికి వచ్చింది. (3,4)
19. కాబాలో కాహళం (2)
21. చిత్రకారుడి పనిముట్టు (2)
22. నిజ వాసములో సూర్యుడిని వెదుకు. (4)
23. రామాయణ విషవృక్షం, ఇదండీ మహాభారతం తర్వాత ఏం చెబుతున్నాయి వేదాలు? అనే పుస్తకం ద్వారా విమర్శలను ఎదుర్కొంటున్న రచయిత్రి. (6)

 

నిలువు:
1. దొంగరి మల్లయ్య ఇంటిపేరుగా మారిన నవల.(4)
2.  వితావితంలో పరిమళము (2)
3. నరకయాతన వంటిదే (5)
5. తోమీ తోమీ తమరితో (2)
6. కండోలెన్స్ మెస్సేజి. (3,3)
9. డి.యోగానంద్ దర్శకత్వంలో 1975లో వెలువడిన మురళీమోహన్ సినిమా. (1,2,4)
10. సంచికలో కస్తూరి మురళీకృష్ణ వ్రాస్తున్న ధారావాహిక. (4,3)
11 ఆలుగడ్డ చివర కోల్పోయి ఉడుమును పోలిన జంతువుగా మారింది.. (3)
12. గజిబిజి అయిన సిపాయి చిన్నయ్య సినిమా హీరోయిన్. (3)
13. ____ ___ ఆవు పాలకోవా. విందుగా పసందుగా ప్రేమనందుకోవా అని రుణానుబంధం సినిమాలో ఎస్.జానకి స్వరవిన్యాసం. (4,2)
16. ఏడుకొండల వానితో కుబేరుడు చేసింది. (2,3)
17. ఒకానొక క్రీడ. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇదే పేరుతో ఒక సినిమా తీశాడు. (4)
20. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన గ్రామము. (2)
21. ఒక తిట్టు. దౌర్భాగ్యుడు. (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను మే 28వ తేదీలోగా puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 2వ తేదీన వెలువడతాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here