‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మధు చిత్తర్వు గారి ఒక వైజ్ఞానిక, కాల్పనిక నవల. (1,1,4) |
4. ఆవేష్టకము. తీగలతో నిర్మించిన అడ్డుకట్ట. (4) |
7. సగం అప్పడాలుతో కత్తి దెబ్బలనుండి కాపాడుకోవచ్చు. (2) |
8. వాకిలి చివరన చిలుక (2) |
9. తప్పు చేయడమెందుకు? సరిదిద్దుకోవడమెందుకు? అని అర్థం వచ్చే సామెతలో తొలి సగం. (3, 4) |
11. సిద్ధాంత కౌముదిలో స్త్రీమూర్తి. (3) |
13. ఇలవేలుపు (5) |
14. కపింజలము (5) |
15. కాలిన కంపు (3) |
18. సకల సౌకర్యాలు కలిగివుండటాన్ని దీనితో పోలుస్తారు. (4,3) |
19. అహం కోల్పోయిన మైనాకం మత్తును కలిగియుంటుందా? (2) |
21. తవ్వునట్టి సాధనము. పలుగు తోటిది. (2) |
22. సూర్యుడొక్కడు, సురరాజులిద్దరు, దినకరద్వయము (4) |
23. సీతాకోక చిలుక సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి. (3,3) |
నిలువు:
1.బిడాలమట్లు ధ్వనించెడి కోపము. (4) |
2.బైబిలులోని మైదానము. (2) |
3.60 మైనస్ 1. (5) |
5. కొడవలి తోడిది. కమ్యూనిష్టుల గుర్తు. (2) |
6. విశ్వనాథవారి నవలారాజము. (4,2) |
9. అతిథిని దేవునిగా భావించే మన ఆర్యోక్తి. (3,4) |
10. ఈ సుందరి యింటిపేరు లక్కరాజు. (4,3) |
11. మరకతమును తిప్పిచూస్తే మొరటు (3) |
12. రాలేని తకరారు. తగవు. (3) |
13. ఇలా అయితే పొరబాటు లేదని సముద్రాల సీనియర్ ఉవాచ. (2,4) |
16. మహాసింహాసనము కాదు. వంటయిల్లు (5) |
17. శిక్ష వేయడానికి మునుపు చేయవలసినది. (4) |
20. నాట్యబంధము. (2) |
21. ప్రవహించు. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా జూలై 28 తేదీన వెలువడతాయి.
పదసంచిక-8 జవాబులు:
అడ్డం:
1.ఆదరాబాదరా 4. శివశివా 7. మణి 8. ఖరి 9. కుండవీనులజోదు 11. గడుసు 13. అవతరణ 14. కదలుమొన 15.నందిత 18. మువ్వన్నియ వేలుపు 19. చవ్య 21. ఇగో 22. రంగవల్లి 23. లలితకళలు
నిలువు:
1.ఆమయావి 2. దణి 3. రామానుజుడు 5. శిఖ 6. వారిరుహానన 9. కుండపోతవర్షము 10. దుక్కివాలుతాలుపు 11. గణనం 12. సుకత 13. అగమ్యగోచరం 16. దివియకోల 17. కొనుగోలు 20. వ్యగ 21.ఇళ
పదసంచిక-8 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- శుభా వల్లభ
- పొన్నాడ సరస్వతి
- ఈమని రమామణి