[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పంచదార, కిరోసిన్, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను ప్రభుత్వం తన అజమాయిషీలో అందజేసే విధానం (6) |
4. పాషా దుహితతో ప్రభువు (4) |
7. శతసహస్రాలు (2) |
8. పుష్కరములో గుగ్గిలపు చెట్టు (2) |
9. వానమామలై వరదాచార్యులు, కూరెళ్ల విఠలాచార్యులు కలిగిన బిరుదము. (4,3) |
11. కాకాని కమలగారి కానుక (3) |
13. పదసంచిక వచ్చే రోజు (5) |
14. కాస్త మోటుగా గురుశంక తీర్చుకోవడానికి వెళ్ళుట. (3,2) |
15. సకటుడు చేసిన పాపము (3) |
18. ఉభయ కవిమిత్రుడితడు. (3,4) |
19. తుది లేని దునియా. (2) |
21. కృతపుంఖుడు తొక్కిన దారి (2) |
22. శషబిషలు లేవు భిషక్కే. (4) |
23. యముడు. (6) |
నిలువు
1. రావణుడు లేక కుబేరుడు (4) |
2. పాదరక్షల్లో పంచదార చిలక హీరోయిన్ (2) |
3. కర్ణాటక సంగీతంలో 32 వ మేళకర్త రాగము (5) |
5. పురుషాధీనమైన అంగడి (2) |
6. అగ్నికి పర్యాయపదం బంగారుచుక్కా? (6) |
9. దాశరథి రంగాచార్య బిరుదము (3,4) |
10. పాలగుమ్మివారి జూపార్కు. మొదట్లో కొంచెం అటూయిటూ అయ్యింది. (4,3) |
11. గంధపుష్పాదుల యందు అపేక్ష గల స్త్రీ అని నిఘంటువు అర్థం చెబుతోంది. (3) |
12. ఆంగ్ల విద్యుత్తు. (3) |
13. ఆనకట్టపై విజయదుందుభిని వాయించిన వసుదేవుడు (6) |
16. చాటువులు (5) |
17. కొమ్ము ఇచ్చి తడబడు సరిచేస్తే పిల్లవాడు (4) |
20. విధిలేని విషనిధిని తిరగేస్తే మత్తు. (2) |
21. మగకోడి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 నవంబరు 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 నవంబరు 24 తేదీన వెలువడతాయి.
పదసంచిక-25 జవాబులు:
అడ్డం:
1.పయిలంకొడుకో 4.పితామహి 7.తనాం 8.డిమ 9.చింతాఅప్పల్నాయుడు 11.విడత 13.యశఃపటహం 14.విపరీతము 15.గంగక 18.ముగయాధమేశ్వఅ 19.రాశి 21.తేలు 22.వులవలు 23.నిదాఘకరుడు
నిలువు:
1.పతముడు 2.యినాం 3.కోటప్పకొండ 5.మడి 6.హిమసమూహము 9.చింతాకుపతకము 10.డురుశ్వరీనార్ధఅ 11.విహంగం 12.తవిక 13.యస్వీరంగారావు 16.గళధమని 17.కుచేలుడు 20.శిల 21.తేరు
పదసంచిక-25కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- బావాజీ ఎర్రమిల్లి
- జి.యస్. బద్రీనాథ్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కనకగిరి రాజేశ్వరి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- తాతిరాజు జగం
- శంభర వెంకట రామ జోగారావు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.