‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. విద్యాసంస్థలలో చేర్చుకోవడానికి ముందు నైపుణ్యాన్ని పరీక్షించే పద్ధతి (6) |
4. బాలచంద్రుడు (4) |
7. ఈవి (2) |
8. పూతనలో ఆత్మార్థకము (2) |
9. అతడు సినిమాలో హిట్టైన తనికెళ్ల భరణి డైలాగు. అదే పేరుతో ఒక సినిమా వచ్చింది. (2,3,2) |
11. ఒడుదుడుకులలో ఒకటి (3) |
13. అతిమూత్ర వ్యాధిగ్రస్తుడు (5) |
14. అహర్నిశము (5) |
15. తనువు గుణింతాలు మారిస్తే తృప్తి. (3) |
18. దయ్యమును పేరులో కలిగిన శివయ్య కుడి నుంచి ఎడమకు (7) |
19. సవ్యంగా లేని భవనం (2) |
21. ఆయాసములోని ఉక్తి విశేషము (2) |
22. దుముకుట (4) |
23. పోరంకి దక్షిణామూర్తి తెలంగాణ భాషలో చేసిన నవలాప్రయోగం (3,3) |
నిలువు
1. ఆల్టర్నేటివ్ (4) |
2. __ కన్నా ప్రాణం మిన్న అనేది రహదారులపై కనిపించే నినాదం.(2) |
3. గాయపడినవాడు (5) |
5. తందానా తానె తందనాన తందానా దేవ నందనానా (2) |
6. సువర్ణాకాశము ఈ పుష్ప విశేషము (6) |
9. పురాతన కాలము కానిది (4,3) |
10. పచ్చి మిర్చీతో చేసే స్పైసీ స్నాక్ శీర్షాసనం వేసింది. (2,5) |
11. డాటరు (3) |
12. నీచుడైన కవి. (3) |
13. ఈ వేసవివిడిదిలో సన్యాసుల జలపాత్ర అగుపిస్తుంది. (6) |
16. లోకాతీతమైన జ్ఞానం. ఒకానొక సమాధి స్థితి. (5) |
17. గడసరి అత్తకు జోడీ ఈ కోడలు (4) |
20. అంతు లేని మబ్బు (2) |
21. సామల సదాశివగారి జ్ఞాపకం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 26 తేదీన వెలువడతాయి.
పదసంచిక-34 జవాబులు:
అడ్డం:
1.కొంగుబంగారము 4.శప్తభూమి 7.డల్లి 8.తిస్వా 9.మిణుగురుపురుగు 11.సకంప 13.అంగడిబొమ్మ 14.ళతడుమినా/ళమిడుతనా 15.తంకము 18.ముద్రాంగుళీయకము 19.ణఫే 21.హోదా 22.ములక్కాడ 23.లంచగొండితనం
నిలువు:
1.కొండపొలం 2.గుల్లి 3.ముదురుపాకం 5.భూతి 6.మిస్వాణయరానా 9.మిడిమిడిజ్ఞానం 10.గుడుగుడుగుంచము 11.సమ్మతం 12.పళము 13.అంతఃకరణము 16.కదళీఫలము 17.రక్తదానం 20.ఫేల 21.హోత
పదసంచిక-34కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- ఈమని రమామణి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.ఝాన్సీరాణి
- స్వర్ణకుమారి
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.