[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అల్లు గారి జామాతా? జామకాయా? 1995నాటి తెలుగు సినిమా. (3,3) |
4. తుమ్మెద (4) |
7. వలకడలో తిండి (2) |
8. ఖురానుతో వచ్చెదనను.(2) |
9. సిరికిం జెప్పడు ఈ ఛందస్సులో వుంది. (3,4) |
11. ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం పొందిన ఛాయారాజ్ కావ్యం (3) |
13. బుద్ధిశాలి + అగ్నిహోత్రము = గుర్రము (5) |
14. పంది కేలరా ___ __ అని లోకోక్తి. (3,2) |
15. లయ తప్పినా కువలయము కువలయమే. (3) |
18. దేవులపల్లి కృష్ణశాస్త్రి తండ్రి తమ్మన్నశాస్త్రి విరచితము (4,3) |
19. కుడినుంచి ఎడమకు దట్టమైన నారు వరుస(2) |
21. పూటకూళ్లయింటిలో సంధ్య (2) |
22. రాయబడింది (4) |
23. ఋషి బడాయి ఉపవాసమా? (6) |
నిలువు
1. ఆకాశం నీ హద్దురా… ____ వదలొద్దురా… (4) |
2. మొద్దు upside-down. (2) |
3. కబ్బపు అవలోడనము (5) |
5. టర్కీదేశపు కరెన్సీ (2) |
6. హెచ్చార్కెని ఇలా పిలిచినా పలుకుతారు (6) |
9. తాతా సుబ్బరాయశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నంల సామ్యము (7) |
10. ముదిగొండ శివప్రసాద్ వ్రాసిన ఒక చారిత్రక నవల (4,3) |
11. ఎర్ర తామరనో, తెల్ల కలువనో తిరగేస్తే వచ్చే వాయ్దపరికరం (3) |
12. పనిముట్టుతో కలశము (3) |
13. దీని రద్దుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. (6) |
16. లేడీస్ (5) |
17. ప్రహరి (4) |
20. చెలికత్తె/కాడు (2) |
21. అల వైకుంఠపురములో ప్రధాన తార (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 01 తేదీన వెలువడతాయి.
పదసంచిక-39 జవాబులు:
అడ్డం:
1.తపసికన్పాప 4.గొడగూచి 7.లప్ప 8.నిలు 9.ముహలకయణప్ర 11.ఎముక 13.కటకటాలు 14.రీతిపుష్పము 15.కరోనా 18.హంసతూలికాతల్పం 19.రాక 21.బూతు 22.వుక్కురోశం 23.టక్కుటమారాలు
నిలువు:
1.తలకట్టు 2.పప్ప 3.పరికరము 5.గూని 6.చిలువాయనము 9.ముయన్యాకకాసహం 10.ప్రభుత్వపుసంకల్పం 11.ఎలుక 12.కరీనా 13.కత్తిపద్మారావు 16.రోకలిపాట 17.దంపతులు 20.కక్కు 21.బూరా
పదసంచిక-39కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- కనకగిరి రాజేశ్వరి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- శంభర వెంకట రామ జోగారావు
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.