[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అసాధ్యమైనదీ అంబరసూనము (6) |
4. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని (4) |
7. కొన్ని మండలాల సమూహము (2) |
8. చెడు రక్తవాహిని (2) |
9. తామరపువ్వు(7) |
11. ఉదకం (3) |
13. 90వ దశకంలో ప్రతి శుక్రవారం సాయంత్రం దూరదర్శన్‌లో ఈ ప్రోగ్రాం కోసం జనాలు ఎదురుచూసేవారు. (5) |
14. కీర్తిపొందు (5) |
15. పారుతను సరిచేస్తే నెత్తికెక్కుతుంది. (3) |
18. లక్ష్మిదేవి అసలు జబ్బుల లివరా? (7) |
19. వేయి పడగలలోని నింబము (2) |
21. కదిలె, జరిగె (2) |
22. పలుములా? కాదు దున్నపోతు. (4) |
23. ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది అని రాజేంద్రపసాద్ పాడింది ఈ సినిమాలోనే (4,2) |
నిలువు:
1. గడబిడ, చిక్కరబక్కర వంటిదే (4) |
2. ఈ జయదేవ్‌గారి ఇంటిపేరు క్యాష్ కౌంటరా? (2) |
3. మంత్రుల సమూహము, కేబినెట్ (5) |
5. రక్కసిదాయ కడుపులో పరిచారిక (2) |
6. విడదీయరాని సమస్య చింతకాయ తొక్కు కాదూ?(6) |
9. పాల సముద్రం కొబ్బరిపాలు కాదు చెరుకుపాలది. (7) |
10. ఇచ్చకాలు (7) |
11. గుప్పెడుమనసుతో ఇదికథకాదు అంటూ మరోచరిత్ర సృష్టించిన నటి (3) |
12. యాంకరు. సుమలాంటి వారు కాదు. (3) |
13. గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి శ్రీకృష్ణునికి ఉపయోగపడింది. (6) |
16. ఈ జగం పాపది కాదు పాతాళానిది. (5) |
17. విశ్రాంతి లేకుండా యాంత్రికంగా చాకిరీ చేసే జీవితాన్ని దీనితో పోలుస్తారు. (4) |
20. పలాసలో లభ్యమయ్యే గరిటె (2) |
21. హస్తరేఖా శాస్త్రం మొదట్లో వ్యాయామం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 22 తేదీన వెలువడతాయి.
పదసంచిక-42జవాబులు:
అడ్డం:
1.స్వపరిపాలన 4.హలభూతి 7.కీరి 8.జల 9.పరశురామప్రీతి 11.అపర్ణ 13.కులుకులాడి 14.పౌరాణికము 15.విలోమి 18.గాల్వనీమాపకము 19. యవ 21.దాగు 22.నడిరేయి 23.డుబుడుక్కవాడు
నిలువు:
1.స్వకీయము 2.పరి 3.నగరాధిప 5.భూజ 6.తిలతండులము 9.పచ్చనాకుసాక్షిగా 10.తిరుమణివడము 11.అడివి 12.ర్ణపౌమి 13.కురంగనయన 16.లోకమాన్యుడు 17.సుభగుడు 20.వడి 21.దావా
పదసంచిక-42కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అభినేత్రి వంగల
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- ఈమని రమామణి
- కన్యాకుమారి బయన
- కృష్ణారావు భాగవతుల
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- సరస్వతి పొన్నాడ
- శంభర వెంకట రామ జోగారావు
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.