పదసంచిక-44

0
9

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అసాధ్యమైనదీ అంబరసూనము (6)
4. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని (4)
7. కొన్ని మండలాల సమూహము (2)
8. చెడు రక్తవాహిని (2)
9. తామరపువ్వు(7)
 11. ఉదకం (3)
13. 90వ దశకంలో ప్రతి శుక్రవారం సాయంత్రం దూరదర్శన్‌లో ఈ ప్రోగ్రాం కోసం జనాలు ఎదురుచూసేవారు. (5)
14. కీర్తిపొందు (5)
15. పారుతను సరిచేస్తే నెత్తికెక్కుతుంది. (3)
18. లక్ష్మిదేవి అసలు జబ్బుల లివరా? (7)
19. వేయి పడగలలోని నింబము (2)
21. కదిలె, జరిగె (2)
22. పలుములా? కాదు దున్నపోతు. (4)
23. ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది అని రాజేంద్రపసాద్ పాడింది ఈ సినిమాలోనే (4,2)

 

నిలువు:

1. గడబిడ, చిక్కరబక్కర వంటిదే (4)
2. ఈ జయదేవ్‌గారి ఇంటిపేరు క్యాష్ కౌంటరా? (2)
3. మంత్రుల సమూహము, కేబినెట్ (5)
5. రక్కసిదాయ కడుపులో పరిచారిక (2)
6. విడదీయరాని సమస్య చింతకాయ తొక్కు కాదూ?(6)
9. పాల సముద్రం కొబ్బరిపాలు కాదు చెరుకుపాలది. (7)
10. ఇచ్చకాలు (7)
11. గుప్పెడుమనసుతో ఇదికథకాదు అంటూ మరోచరిత్ర సృష్టించిన నటి (3)
12. యాంకరు. సుమలాంటి వారు కాదు. (3)
13. గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి శ్రీకృష్ణునికి ఉపయోగపడింది. (6)
16. ఈ జగం పాపది కాదు పాతాళానిది. (5)
17. విశ్రాంతి లేకుండా యాంత్రికంగా చాకిరీ చేసే జీవితాన్ని దీనితో పోలుస్తారు. (4)
20. పలాసలో లభ్యమయ్యే గరిటె (2)
21. హస్తరేఖా శాస్త్రం మొదట్లో వ్యాయామం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 22 తేదీన వెలువడతాయి.

పదసంచిక-42జవాబులు:

అడ్డం:                                 

1.స్వపరిపాలన  4.హలభూతి  7.కీరి  8.జల  9.పరశురామప్రీతి  11.అపర్ణ  13.కులుకులాడి  14.పౌరాణికము  15.విలోమి  18.గాల్వనీమాపకము 19. యవ  21.దాగు  22.నడిరేయి  23.డుబుడుక్కవాడు

నిలువు:

1.స్వకీయము  2.పరి  3.నగరాధిప  5.భూజ  6.తిలతండులము  9.పచ్చనాకుసాక్షిగా  10.తిరుమణివడము 11.అడివి  12.ర్ణపౌమి  13.కురంగనయన  16.లోకమాన్యుడు  17.సుభగుడు  20.వడి 21.దావా

పదసంచిక-42కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అభినేత్రి వంగల
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • కృష్ణారావు భాగవతుల
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • శంభర వెంకట రామ జోగారావు
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here