[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. లోభిని కోరుకున్న చిన్నది. ఒక్కొక్కరి టేస్టు ఒక్కోరకంగా ఉంటుంది మరి. (6) |
4. విష్ణువు యొక్క ఆయుధం (4) |
7. నాటుకోడితో నరము (2) |
8. బాబూ జగ్జీవన్‌రామ్ కూతురు. (2) |
9. మాదిరెడ్డి సులోచన నవల అగ్నిపరీక్ష ఆధారంగా తీయబడిన తెలుగు సినిమా. (4,3) |
11. కథారచయిత సి.హెచ్.వెంకటరత్నం కలంపేరు. (3) |
13. గొప్ప గౌరవం. (5) |
14. ధర్మాంగదుని తండ్రి. (5) |
15. భ్రూణము (3) |
18. అరవైరెండో మేళకర్తరాగం (7) |
19. ప్రభుత్వ చర్యలతో తాట తీయండి. (2) |
21. ఏదో కథలో దాగిన మోసం. (2) |
22. ఇది కూడా విష్ణువు ఆయుధమే. (4) |
23. విశ్వనాథ వారి విశిష్ట రచన ముందువెనుకలయ్యింది. (6) |
నిలువు:
1. లోతుగా తెలుసుకొని (4) |
2. ఈ శిఖండి పేడి కాదు (2) |
3. ఆఖరి ఆర్తనాదము (3,2) |
5. ఒక రకమైన చిన్న హుక్కా (2) |
6. 1986లో నరేష్, మనోచిత్రలు జంటగా వచ్చిన సినిమా (3,3) |
9. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగులో కాంస్యపతకాన్ని సాధించిన అథ్లెట్ (3,4) |
10. రాయైతే నేమిరాదేవుడూ అనే శుభోదయం సినిమాలోని పాటలో కనిపించే మిక్కిలి వైభవం (2,2,3) |
11. బారాసి (3) |
12. శిల్పి (3) |
13. ముద్దుపళని వ్రాసిన శృంగార ప్రబంధం (3,3) |
16. వ్యర్థ ప్రేలాపనలు (5) |
17. ఓ బంగరు రంగుల చిలకా ____ అని తోటరాముడు సినిమాకు దాశరథి వ్రాసినపాట. (4) |
20. కావురు (2) |
21. జంట (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 06 తేదీన వెలువడతాయి.
పదసంచిక-79 జవాబులు:
అడ్డం:
1.ఉదయచంద్రిక 4.మందాకిని 7.చిత్తు 8.గిద్ద 9.అకీరాకురొసావా 11.అరంచి 13.సరసరస 14.కాలాతీతము 15.వసారా 18. నంతాపతీర్మానము 19.పాపం 21.సుమ 22.లంచగొండి 23.త్రయ్యంతగంధము
నిలువు:
1.ఉచితము 2.దత్తు 3.కథాకుటీరం 5.కిగి 6.నిద్దపుదనము 9.అవిశ్వాసతీర్మానం 10.వాయిదాతీర్మానము 11.అసవ 12.చికారా 13.సల్లాపగోపాలం 16.సాహితీమిత్ర 17.సంయమము 20.పంచ 21.సుధ
పదసంచిక-79కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- కన్యాకుమారి బయన
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.