[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
6. నిలువు 1 లా ధ్వనించే కడపజిల్లాలోని ఒక గ్రామం. (4) |
7. అయోమయం మన్మథుడు తోక వదిలించుకున్నాడు. (4) |
8. రాక రాక వచ్చావు చందమామ లేక లేక నవ్వింది _____ అని ఆత్రేయ అంటే నింగిలోన చందమామ తొంగి చూచె నీటిలోన _____ పొంగి పూచె అని సి.నా.రె. అంటారు. (5) |
9. తిరగబడిన తమిళనాడు నగరం (3) |
11. ఆన్‌లైన్ తెలుగు పుస్తకాలకు చిరునామా (3) |
12. ఇంద్రునిచే చంపబడిన ఒక రాక్షసుడు (3) |
14. దూలం కలిగిన మానవ శ్రేష్టుడు (5) |
15. కివి పండ్ల రసము (5) |
16. మెరుపులోని సంఖ్యావాచకాన్ని తొలగించి శనిపత్నిని చూడు (3) |
18. యావత్తు లేని వాక్యము (3) |
20. దృశ్యసాధనాలలో పోలికా? (3) |
22. అడ్డదిడ్డంగా ఉన్న రేణుక కారు. (5) |
24. నిలువు 22తో వెనుదిరిగిన సూర్యుడు (4) |
25. వ్యాపారపు ఆవశ్యకత పరాధీనతను కలిగి ఉంటుంది కానీ తడబడుతూ.(4) |
నిలువు:
1. అడ్డం 6లా ధ్వనించే నెల్లూరు జిల్లాలోని ఓ మండలం (4) |
2. ఒడంబడిక తారుమారయ్యింది. ఏమిటీ తకరారు? (3) |
3. మల్లయుద్ధంలో ఈ పట్టు అంటే కరవడము కాదు. (5) |
4. క్రింద నుండి ధ్యానం (3) |
5. అజీజ్ నవల. నాటకమూ. (4) |
10. ఉలిమిరి (5) |
11. గోదావరికి ఉపనది చివర కొంచెం తొట్రుపడింది. (5) |
12. భారతదేశపు ప్రాచీన విద్యాపీఠము. (3) |
13. లోనికి చిమ్మితే వెనుక వక్క దొరికింది. (3) |
17. జ్యోతిర్బీజాలు అటూ ఇటూ ఎగురుతున్నాయి. (5) |
19. తలతెగిన ఱ (4) |
21. మటుమాయం 2,4,3,1 (4) |
22. అడ్డం 24లో చంద్రుడు. (3) |
23. పాకాలపాడులో తడవు (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూన్ 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 110 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూన్ 27 తేదీన వెలువడతాయి.
పదసంచిక-108 జవాబులు:
అడ్డం:
1.పుటుక్కుజరజరడుబుక్కుమే 8.సంగతి 9.వర్ణలిపి 10.కొంగజపం 11.ఋణము 13.కదం 15.కుషి 16.రుసుం 18.చంచూ 19.లాభసాటి 20.దడదడ 21.వనం 22.లంగా 24.బీరం 25.ముమే 27.రముడు 30.దేవజాతి 31.పురమమై 32.బాశాలి 34.మల్లికార్జునపండితారాధ్యుడు
నిలువు:
1.పులవర్తికలావతీదేవిమ 2.క్కుభులిబ 3.రసం 4.జగజ్జాణ 5.రతి 6.బుద్ధగయ 7.మేడిపండుచూడమేలిమైయుండు 11.ఋషి 12.మురు 14.దంభనం 15.కుటిలం 17.సుందరం 18.చందము 23.గార 24.బీడు 26.హజారికా 28.మునిశాపం 29.సరఫరా 32.బాన 33.లిడి
పదసంచిక-108 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
- అభినేత్రి వంగల
- అన్నపూర్ణ భవాని
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- ఆనందరావు
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం నాగలక్ష్మి
- కరణం పూర్ణనందరావు
- కరణం శివానంద పూర్ణనందరావు
- కరణం శివానందరావు
- కస్తల పద్మావతి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పద్మావతమ్మ
- పరమేశ్వరుని కృప
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పార్వతి వేదుల
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శివ కేశవ రాజు ఆనంద్
- మాలతి యశస్విని
- శశికళ
- సాయి దివ్య సాయి సుధ
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సుందరమ్మ
- శంబర వెంకట రామ జోగారావు
- శివార్చకుల రాఘవేంద్రరావు
- శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
- శ్రీకృష్ణ శ్రీకాంత్
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు S
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీనివాస సుబ్రహ్మణ్య శ్రీకాంత్
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతరాజు జగం
- వరప్రసాదరావు పాల
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వేణు గోపాలరావు
- వైదేహి అక్కపెద్ది
- షణ్ముఖి సహస్ర
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.