[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కిళాంబి వేంకట నరసింహాచార్యులు గారు ___ పేరుతో ప్రసిద్ధులు.
- డా. సి. నారాయణ రెడ్డి గారు ఏ చిత్రంలో తాను రాసిన పాటను స్టేజీపై తానే పాడుకున్నారు?
- ‘ఓహో బస్తీ దొరసాని, బాగా ముస్తాబయింది అందాచందాల రాణి’ పాట ఏ చిత్రం లోనిది? ఆ పాట మాతృక అయిన హిందీ చిత్రం ఏది?
- ‘రావె రాధా రాణీ రావే, రాధ నీవే కృష్ణుడ నేనే’ అను పాట ‘శాంతినివాసం’ సినిమా లోనిది. ఈ పాట మాతృక అయిన హిందీ చిత్రం పేరేమిటి?
- ‘కానిస్టేబుల్ కూతురు’ చిత్రానికి కథను సమకూర్చినది ఎవరు?
- ‘రాము’ (ఎన్.టి.ఆర్) చిత్రానికి కథ వ్రాసినది ఎవరు?
- విశ్వనాథన్-రామ్మూర్తి గార్లు తెలుగులో మొట్టమొదట సంగీతం సమకూర్చిన చిత్రం పేరేమిటి?
- ‘అందాల సీమా సుధా నిలయం, ఈ లోకమే దివ్య ప్రేమమయం’ పాటను రమేష్ నాయుడి సంగీత దర్శకత్వంలో పాడినది ఎవరు?
- పేకేటి శివరాం దర్శకత్వం వహించిన ఎన్.టి.ఆర్ చిత్రం ‘కులగౌరవం’ కు సంగీత దర్శకుడు ఎవరు?
- ఎన్.టి.ఆర్, కృష్ణంరాజు, రామకృష్ణలు నటించిన సినిమా ఏది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 అక్టోబరు 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 అక్టోబరు 09 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 2 జవాబులు:
1.మాడ్ మాక్స్ 2. ఫస్ట్ బ్లడ్ 3. తుమ్ సా నహీ దేఖా 4. రాజా రమేష్ 5. ఆరాధన 6. ఆత్మబలం 7. మాంగల్యబలం 8. ఎదురీత 9. బాటసారి
సినిమా క్విజ్ 2 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మణి నాగేంద్రరావు బి
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- ఎస్. సునితా ప్రకాష్
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]