[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రాయలసీమలో గరాటు (3) |
4. సంపద (3) |
6. హోమము (3) |
7. తునక (3) |
8. టిట్ ఫర్ టాట్ ను తెలుగులో చెప్తే ఇలా ఉంటుంది (9) |
9. మాయ, మర్మము (3) |
11. ఒకవిధమైన చిన్న గోనెసంచి (3) |
13. కొత్తబట్ట (3) |
14. ఒక దేవ జాతివాడు – కుబేరుడు కూడా కావచ్చు (3) |
నిలువు:
1. ఒంటె (3) |
2. తినుట (3) |
3. దేనికి తగ్గ సమస్యలు దానికి ఉంటాయి అని చెప్పడానికి ఈ ‘గాలి’ సామెతను వాడచ్చు (9) |
4. కరాపువు (3) |
5. మీరు పూర్తి చేస్తున్న పజిల్ ఇందులో ఉంది (3) |
9. శివుని త్రిశూలము (3) |
10. పరిఖ (3) |
11. క్షయము కాని ఒకానొక సంవత్సరము పేరు (3) |
12. సూర్యుడే! (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 28 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 55 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 02 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 53 జవాబులు:
అడ్డం:
1.శ్రీరంగం 4. తులసి 6. ఖట్టిక 7. కమతం 8. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా 9. మహతి 11. మహిమ 13. నంతజ 14. ద్రవ్యము
నిలువు:
1.శ్రీముఖ 2. గండిక 3. సుందరవదనారవిందం 4. తునుక 5. సిద్ధాంతం 9. మథనం 10. తిగజ 11. మహేంద్ర 12. మవ్వము
సంచిక – పద ప్రతిభ 53 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.