[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 8’ అనే కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]డక
నువ్వు నేర్చుకోవాలి
నడవడిక
నీకు నేర్పుతుంది
నాన్న ఎప్పుడూ
‘జీరో’ అవుతుంటాడు
మనల్ని
‘హీరో’ చేయడానికి
నా అక్షరాలు
తుమ్మెదలు
నస పెడుతుంటాయి
ఆహ్లాద పరుస్తుంటాయి
రైలు పట్టాలు
తాము ఎడబాటౌతూనే
బంధాలను
కలుపుతాయి
కవిత్వానికి
జోహార్లు
గాయమైనప్పుడల్లా
సేద తీరుస్తుంది