[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు, రచయితలకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.
‘సంచిక’లో ప్రచురితమవుతున్న అన్ని రచనలు, కథలు, అనువాద కథలు, కవితలు, అనువాద కవితలు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.
పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో తెలుగు సాహిత్యం అధికంగా పాలస్తీనా స్వరమే వినిపిస్తోంది. తొలిసారిగా ‘సంచిక’ సాహిత్య వేదిక ఇజ్రాయెల్ స్వరాన్ని కూడా వినిపిస్తోంది. గత వారం ప్రచురించిన రెండు అనువాద కవితలు విభిన్న దృక్పథాలను వెల్లడించాయి. నాణేనికి రెండు వైపులా ప్రదర్శించాయి. రాబోయే కాలంలో మరిన్ని విభిన్న దృక్కోణాలకు, విభిన్న స్వరాలకూ చోటిస్తుంది విశిష్టమైన సాహిత్య వేదిక ‘సంచిక’.
‘సంచిక’ మాసపత్రికలో ప్రస్తుతం ‘అంతరిక్షంలో మృత్యునౌక’ అనే సైన్స్ ఫిక్షన్ ధారావాహిక కొనసాగుతున్న సంగతి తెలిసినదే. సైన్స్ ఫిక్షన్ అంటే ప్రత్యేకాసక్తి ఉన్న పాఠకుల కోసం త్వరలో మరో సైన్స్ ఫిక్షన్ అనువాదాన్ని అందించనున్నాము.
సాహిత్యపరంగానో, సాంకేతికంగానో కొన్ని పుస్తకాలు కొన్నిసార్లు మన ఊహలను ఆకర్షించి మన మనసులపై చెరగని ముద్ర వేస్తాయి! ప్రస్తుతం లేదా గతంలో మనకు ప్రేరణ కలిగించిన పుస్తకమేదో మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అటువంటి అద్భుతమైన రచనల గురించి తోటి పాఠకులతో పంచుకునేలా ఒక కొత్త ఫీచర్ త్వరలో ప్రారభించబోతున్నాము.
పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.
ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 నవంబరు 2023 సంచిక.
1 నవంబరు 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
సీరియల్:
- అంతరిక్షంలో మృత్యునౌక-3 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…19 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-3 – శ్రీ కుంతి
భక్తి:
- బ్రహ్మసూత్ర శివలింగము – డా. మార్కండేయులు జొన్నలగడ్డ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- నవంబరు 2023- దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -44 – ఆర్. లక్ష్మి
- మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-6 – పాణ్యం దత్తశర్మ
- గురజాడ పూర్ణమ్మ – డా. సి. భవానీదేవి
కవితలు:
- తెరవని కిటికీ తలుపు – శ్రీధర్ చౌడారపు
- కొత్త ఉదయాలు – డా. విజయ్ కోగంటి
- మౌనంతో పొట్లి.. – చందలూరి నారాయణరావు
- అభిసారిక – డా. బాలాజీ దీక్షితులు పి.వి.
కథలు:
- గతం లోకి.. సలీం
- జలగా రావ్ – గంగాధర్ వడ్లమన్నాటి
- ఆత్మ బంధం – జి.వి. కళ్యాణ శ్రీనివాస్
- ఎదురు చూపులు – టి.ఎస్.ఎస్. మూర్తి
పుస్తకాలు:
- విశ్వకవి విలక్షణ సృష్టి – ‘పడవ మునక’ – పుస్తక పరిచయం – గోనుగుంట మురళీకృష్ణ
- స్వరసామ్రాజ్ఞి లతాజీ (సంగీత సరస్వతి లతా మంగేష్కర్) – పుస్తక సమీక్ష – అల్లూరి గౌరీలక్ష్మి
- VVS.. అనే ఓ మహా సినీవృక్షం (ముందుమాట) – పుస్తక పరిచయం – భువనచంద్ర
బాల సంచిక:
- వింత లిపి – కంచనపల్లి వేంకటకృష్ణారావు
- పచ్చని చెట్టు – ప్రతి ఒక్కరి బంధువు – ఆరవేటి రాజకుమార్
అవీ ఇవీ:
- నృగ రాజు – శాపము – శాపవిమోచనం – అంబడిపూడి శ్యామసుందర రావు
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.