ఇజ్రాయిల్ విముక్తిలో భారత సైనికుల వీరోచిత సమరం – పుస్తక పరిచయం

0
4

[dropcap]మొ[/dropcap]దటి ప్రపంచ యుద్ధంలో భాగంగా 900 మంది భారతీయ సైనికులు ఓట్టోమన్ టర్క్ పాలనలో ఉన్న హైఫా నగరాన్ని విముక్తం చేయడంతో ఇజ్రాయిల్‌లో యూదుల స్వతంత్ర్య రాజ్య అవతరణకు అంకురార్పణ జరిగిందని ఈ పుస్తకం తెలుపుతుంది. ఆరు అధ్యాయాలు, నాలుగు అనుబంధాలు ఉన్న ఈ చిన్న పుస్తకాన్ని రవికుమార్ వ్రాయగా, కేశవ తెలుగులోకి అనువదించారు.

***

“విదేశాలలో మన సైనికులు సాధించిన విజయాలను మనం మరచిపోకూడదు. అందుకనే అలాంటి ఒక సువర్ణ ఘట్టాన్ని వెలుగులోకి తీసుకురావాలని నేను ప్రయత్నించాను. జోధ్‌పూర్, మైసూరు మహారాజులు పంపిన అశ్వికులు 1918 సెప్టెంబర్ 22, 23లలో టర్కులు, ఆస్టియన్లు, జర్మన్లతో కూడిన అపారమైన ఒట్టమాన్ సెన్యాన్ని ఎదిరించి పోరాడి విజయం సాధించారు. అంతకుముందు ఆ సైన్యాన్ని చూసి గుండెజారిన బ్రిటిష్ సేనలు పలాయనం చిత్తగిస్తే భారతీయ సైనికులు మాత్రం నిలబడి పోరాడారు. భారతీయ సైనికుల పరాక్రమం, ధైర్యం, త్యాగంవల్ల సుదూర భూఖండమైన ఇజ్రాయిల్‌లో ఒక జాతి (యూదులు) స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. తమ కోసం అపూర్వ బలిదానం చేసిన భారతీయ సైనికుల సమాధులను ఇప్పటికీ ఇజ్రాయిల్ ప్రజలు, ప్రభుత్వం గౌరవపూర్వకంగా, శ్రద్దతో చూస్తున్నాయి. సైనిక దళాలలో హైఫా యుద్ధం గురించి తెలిసినవాళ్ళు చాలామందే ఉన్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి మాత్రం మన సైనికుల వీరోచిత గాథ తెలియదు. అందుకనే ఆధునిక ఇజ్రాయిల్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన భారతీయ సైనికుల గురించి తెలియజేయడానికే ఈ పుస్తకం వ్రాశాను” అని రవికుమార్ తన “రచయిత మాట”లో తెలిపారు.

“విదేశీగడ్డపై అసాధారణమైన పరాక్రమాన్ని చూపిన భారతీయ సైనికుల గురించి ఇంత వివరంగా తెలిపినందుకు సంతోషం. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో 1918, సెప్టెంబర్ 22,23 తేదీల్లో జోధ్‌పూర్, హైదరాబాద్, మైసూర్లకు చెందిన కేవలం మూడు అశ్వికదళాలు కేవలం కత్తులు, బల్లాలతో టర్కులు, జర్మన్లు, ఆస్టియన్లతో కూడిన అపారమైన ఒట్టమాన్ సమైక్య సేనను ఎదుర్కొని ఓడించాయి. ఒట్టమాన్ సైన్యానికి తుపాకులు, ఫిరంగులు ఉన్నాయి. అలాంటి దుర్భేద్యమైన సైన్యాన్ని తరిమికొట్టిన భారతీయ అశ్విక దళం హైఫా పట్టణాన్ని విముక్తం చేసింది. ఆ యుద్ధం మన సైనికుల అద్భుత వ్యూహరచన, ధైర్యం, సాహసం, నిష్ట, అపూర్వ త్యాగానికి గుర్తు. ఈ పుస్తకం ఆనాటి యుద్ధాన్ని మన కళ్ళముందుంచుతుంది” అన్నారు ఎయిర్ మార్షల్ (డా.) ఆర్.సి.బాజ్‌పాయ్.

***

నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 64 పేజీల పుస్తకం వెల రూ.40/-. ప్రతులు సాహిత్యనికేతన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here