“నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన‘ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది ఐదవ ఖండిక ‘జూదము’.
వ్యభిచార వృత్తి – ‘నీలి నీడలు’ ఖండకావ్యంలోని ఐదవ ఖండిక.
***
ఒక్క మాట, బాణమొకటె, నొకతె భార్య
రహిని రామునకంచును రమ్యఫణితి
ప్రజలకందెల్పినట్టి యాప్రముఖమైన
రామచరితము వెలసిన భూమిమనది (1)
అట్టి రాముగాథ గట్టిగ బఠియించి
భారతంబునందు బరగుప్రజలు
భార్యయొకతె యనేడు పావనవాక్యమున్
తలచనెంచరేమి దారుణంబో? (2)
ధరణి ధరాధినాధులును, దారుణి దేవతలున్, ధనాడ్యులున్
వరసగ దక్కువర్ణముల వారలు నెన్నియొ కారణాలచే
కరముగ బెండ్లియాడి యునుకాంతలచేరిమినగ్నిసాక్షిగా
పరగిరియేక పత్నియను ప్రాభ్నియమానికి జేసిభంగమున్. (3)
అట్టి వారలెల్లనగ్నిసాక్షిగగొన్న
అన్యసతులతోడలనరినారు
అంతె కాని మిగుల నక్రమపద్ధతిన్
స్త్రీల బొందినట్టి తోరు లేదు. (4)
పిదప భూనాథులందరు బెద్దరీతి
రాజసభలను నిండ్లను రాణమెఱయ
కాంక్షనుంచిరి యుంపుడుగత్తెలుగను
భోగలాలసుతాచును భోగినులను. (5)
ధరణినాథులు నడచిన దారియందె
పండితున్, ధనపతులును, బ్రహ్మణులును
వేశ్యలనునుంచుకొనినారు వింతరీతి
గొప్పకోసము గులటలగోరికోరి. (6)
అట్లు లభియించినట్టియా యాశ్రయమున
వందలాదిగ పడతులు పతితలైరి
శీలమంతయు లేనట్టి జీవితముల
గడపినారలు, భోగాల గాంక్షజేసి. (7)
అట్టియాధార మింతేనియవనిలేని
వనితలెల్లను కరముగవంతజేంది
శీలమును వీడి సలిపెరి జీవయాత్ర
భోగభాగ్యంబులనాగోరి భుక్తికోరి. (8)
అట్టి వారిజేరి హ్లాదంబునందగ
కోర్కెలెల్ల దీర్చుకొనగనెంచి
జనగణంబులెల్ల జారులైతిరిగిరి
వేశ్యవాడలందు విటులునౌచు. (9)
అన్యకాంతలనిన నాసక్తిపెంపొంద
నధికరీతి పురుషులందరందు
వ్యభిచరించుగుణము, వాంఛవృద్ధియుగాగ
వారివనితలెల్ల ధీరలైరి. (10)