ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు

0
3

[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 19.07.2018 నాడు శ్రీ లలితా పీఠంలో “ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు” అనే అంశంపై శ్రీమాన్ టి.పి.ఎన్.ఆచార్యులుగారి ప్రసంగ కార్యక్రమం జరిగింది.

సభకు విశాఖ సాహితి అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త డా.కోలవెన్ను మలయవాసినిగారు అధ్యక్షత వహించారు. శ్రీమాన్ టి.పి.ఎన్.ఆచార్యులుగారు తమ ప్రసంగంలో నంది తిమ్మనగారి ‘పారిజాతాపహరణం’ పంచ మహాకావ్యాలలో రెండవ స్థానంలో ప్రసిద్ధికెక్కిందని పేర్కొన్నారు. పారిజాతాపహరణంలోని మనోరంజకమైన పద్యాలను ఉదాహరిస్తూ శ్రీమన్ అచార్యులుగారు తిమ్మనగారి ముద్దుపలుకుల సార్థకతని వివరించారు.

డా.కోలవెన్ను మలయవాసినిగారు అధ్యక్షోపన్యాసంలో, ‘పారిజాతాపహరణం’ ప్రాముఖ్యత, పద్యాల విశిష్టత తెలియజేశారు. ప్రముఖ సాహితీ విమర్శకులు డా. డి.వి.సూర్యారావుగారు తమ స్పందన తెలియజేశారు.

విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం వందన సమర్పణ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here