ఆ కళ్ళు

1
9

[box type=’note’ fontsize=’16’] జీవితంలో ఆనందమైనా, బాధైనా వాటిని వ్యక్తం చేసేవి నయనాలేనంటున్నారు సుజాత తిమ్మనఆ కళ్ళు” కవితలో. [/box]

[dropcap]త[/dropcap]ల్లి గర్భం లోనుంచి ఆమె ఒడిలోకి చేరిన క్షణంలో…
ఆ అమ్మ ప్రేమను తాగినవి ఆ కళ్ళు…

నాన్న చూపుల్లో కేరింతల ఉయ్యాలలు ఊగుతూ…
అండగా ఉండే అభిమానపు భరోసాని లాక్కున్నవి ఆ కళ్ళు…

ప్రకృతి తప్ప వేరు లోకం తెలియని కాలంలో…
చెట్టు, పుట్ట, మట్టి, గుట్టలతో మాట్లాడేవి ఆ కళ్ళు …

ఒదగలేని ప్రాయాన్ని ఒడిసి పట్టాలని…
వేసిన ఓణీలో దాచుకుని కలలకావాసమైనవి ఆ కళ్ళు…

తాళి కట్టి వేలు పట్టుకుని వెంట తీసుకెళ్ళిన బావని
మూసిన రెప్పల్లో పధిలంగా దాచుకున్నవి ఆ కళ్ళు…

ఆనందాల సంరంభాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే…
చేతుల్లో చేరిన తన అంకురాన్ని ప్రేమామృతాల తడిపినవి ఆ కళ్ళు…

ప్రతి అడుగుకు చూపుల కంచెవేసి కాపాడుతూ ఉంటే…
అంచెలంచెలుగా ఎదిగిన కొడుకును గర్వంగా చూసినవి ఆ కళ్ళు…

అనుబంధాలను అర్ధంలేనివిగా ఎంచి విదేశీ వ్యామోహంతో
విమానం ఎక్కిన తనయుని తలపులతో తడి అవుతున్నవి ఆ కళ్ళు…

తనదైన లోకంలో తాతై… తల్లిని మరిచినా…
తొంభై సంవత్సరాల వయసు బారాన్ని మోస్తూ..
శుక్లాలు పోసి చీకటైన చూపుల్లో…
తనయుని స్పర్శను వెతుక్కుంటూ ఉన్నవి ఆ కళ్ళు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here