ఆచార్యదేవోభవ-40

1
7

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

గ్రామనామాల దేవర:

[dropcap]ఆ[/dropcap]చార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేసిన ఆచార్యులలో యార్లగడ్డ బాలగంగాధరరావు విశిష్ట వ్యక్తి. మాటలో కటుత్వం, భాషలో పటుత్వం, పరిశోధనలో దృఢత్వం, మైత్రిలో గాఢత్వం ఆయనకున్న ప్రధాన లక్షణాలు. ఆయన ప్రముఖ కవి, సాహితీవేత్త, విమర్శకులు.

కృష్ణాజిల్లా దివి తాలూకా దేవరకోట గ్రామం (చల్లపల్లి సంస్థానం) వీరి జన్మస్థలం. వీరిది పద్మనాయక వంశం. ప్రైవేటుగా పి.యు.సి, బి.ఏ. పరీక్షలు వ్రాసి పాసయ్యారు. కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, రాజా హైస్కూలులో 1962-69 మధ్య పని చేశారు. బి.ఏ. తెలుగు, ఇంగ్లీషు, హిస్టరీలతో పూర్తి చేశారు.

1969-71 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చేయడం వీరి జీవితంలో మలుపు. విశ్వవిద్యాలయ తెలుగు వ్యుత్పత్తి పదకోశంలో 1972-74 మధ్య పని చేశారు. అక్కడే రెండేళ్ళు (1974-76) లెక్చరర్ అయ్యారు. ఆ సమయంలో అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పారు. అనంతపురం జిల్లా గ్రామనామాలపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. దోణప్ప పర్యవేక్షకులు.

1976లో నాగార్జున విశ్వవిద్యాలయం ప్రారంభదశలో లెక్చరర్‍గా చేరి రీడర్, ప్రొఫెసర్‌గా చేసి 2000లలో రిటైరయ్యారు. తర్వాత రెండేళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్‍గా వాల్తేరు వెళ్ళారు. అనంతపురం జిల్లా గ్రామానామాల వ్యుత్పత్తిపై ఆచార్య దోణప్ప పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు.

2006లో తిరుపతిలో పద్మనాభరావు దంపతులను సత్కరిస్తున్న ప్రొఫెసర్ శ్రీ కె. సర్వోత్తమ రావు

నామ విజ్ఞాన శాస్త్రవేత్త:

గ్రామనామాలపై పరిశోధన బాలగంగాధరరావు ప్రత్యేకాభినివేశం. తన శిష్యులచే అవే పరిశోధనలు చేయించి ప్రోత్సహించారు. వోలేటి పార్వతీశం వీరి శిష్యులు. నామ విజ్ఞాన శాస్త్రం పాఠ్యాంశంగా చేసి అంతర్జాతీయ నామ విజ్ఞాన కేంద్రం (బెల్జియం) వారి ప్రశంసలందుకున్నారు.

వీరి రచనలు:

1.ఆదివాసి-ఒరియా-తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు 2. వారికి వాచకాలు, కథలు – గాథలు 3. నామవిజ్ఞానం 4. ఒక ఊరికథ 5. ఇంటిపేర్లు 6. అక్షర యజ్ఞం 7. భావపరిమళము 8. మాటతీరు 9. క్రీడాభిరామం వచనం 10.పలనాటి వీరచరిత్ర 11. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు

పురస్కారాలు:

  1. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిశోధన పురస్కారం
  2. నన్నయ పీఠ పురస్కారం (రాజమండ్రి)
  3. తుమ్మల సీతారామమూర్తి పురస్కారం.

భాషాశాస్త్రవేత్త గంగాధరుడాయన. ఇద్దరు గంగాధరులు…

పరిశోధనా ‘గంగ’:

నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో లబ్ధప్రతిష్ఠులు యస్. గంగప్ప. వీరు 1936 నవంబరు 8న అనంతపురం జిల్లా నల్లగొండ్రాయని పల్లెలో జన్మించారు. ప్రభుత్వ కళాశాల్లో అధ్యాపకులుగా పని చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయములో ఆచార్యులుగా పదవీ విరమణ చేసి గుంటూరులో స్థిరపడ్డారు. గుమ్మా సాంబశివరావు వీరి  అల్లుడు. గంగప్ప పద్యకృతులు మూడు వెలయించారు.

  1. శ్రీకృష్ణ స్తోత్ర త్రయం 2000 – 101 పద్యాల కృతి
  2. హృద్యం తెలుగు పద్యం – 30 శీర్షికల ఖండకావ్యం
  3. తెలుగు భాషా ప్రశస్తి – 72 పద్యాల కావ్యం
  4. కోలాచలం శ్రీనివాసరావు నాటక సాహిత్య సమాలోచనం – పరిశోధనా గ్రంథం.

నిత్య పరిశోధకులు:

గంగప్ప ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బహుమతులందుకొన్నారు. డా. జి.యన్. రెడ్డి పర్యవేక్షణలో 1967-71 మధ్య కోలాచలం శ్రీనివాసరావు నాటకాలు, ఇతర రచనలపై పరిశోధన చేసి, 1972లో పి.హెచ్.డి. పొందారు. 1960లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బి.ఏ. ఆనర్సు చేశారు. వెంటనే ప్రభుత్వ కళాశాలల్లో అనంతపురం, కాకినాడ, విశాఖపట్టణం, హైదరాబాదులలో పని చేశారు. కర్నూలు సిల్వర్ జుబ్లీ కళాశాల శాఖాధ్యక్షులు. 18 సంవత్సరాలు ఆ వృత్తిలో ఇమిడి 1978లో నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ప్రవేశించి, 1983లో రీడరు, 1988లో ప్రొఫెసరయ్యారు. 1989-91 మధ్య శాఖాధ్యక్షులు. 1996 నవంబరులో పదవీ విరమణ చేసిన అవిశ్రాంత గ్రంథ రచనాధురంధరుడు. వేయిపడలపై విశిష్ట గ్రంథం వెలయించారు.

1993లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం స్వీకరిస్తున్న ప్రొఫెసర్ శ్రీ గంగప్ప

1500కి పైగా వ్యాసాలు, శతాధిక సృజనాత్మక గ్రంథాలు వీరి కలం నుండి వెలువడ్డాయి. పద్య కవిత్వం, జానపద, నాటక, ప్రాచీనాధునిక సాహిత్యాలలో దిట్ట. కాకతీయ, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసరు. వీరి పర్యవేక్షణలో 27 పి.హెచ్.డి.లు, 20 ఎం.ఫిల్.లు వెలుగు చూశాయి. గంగప్ప రచనలపై 3 పిహెచ్‌డిలు, 3 ఎంఫిల్‍లు రావడం విశేషం.

పురస్కార పరంపర:

  1. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు – 1973, 1980
  2. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు – 1983, 1989
  3. విశ్వనాథ సాహిత్య పీఠం అవార్డు – 1994
  4. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు – 1991
  5. రాష్ట్ర ప్రభుత్వ హంస (కళారత్న) అవార్డు – 2012

1997 నుంచి గంగప్ప సాహితీ పురస్కారం పేర ఉత్తమ సాహిత్యవేత్తకు అవార్డు ఇచ్చే విశిష్ట సంప్రదాయం మొదలుపెట్టారు.

అంకుర విశ్వవిద్యాలయాలు:

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 2006, 2007, 2008లలో పలు నూతన విశ్వవిద్యాలయాలు పురుడు పోసుకున్నాయి. 15 సంవత్సరాలు గడిచినా అవి శైశవ దశలోనే వున్నాయి.

1.యోగి వేమన కొలువులో:

కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం 2006 మార్చి 9న రాష్ట్ర శాసనసభ చట్టంతో ఏర్పడింది. అంతకుముందున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ పి.జి.సెంటర్‍ని విశ్వవిద్యాలయంగా మార్చారు. ప్రస్తుతం 115 మంది అధ్యాపకులు 200 మంది అధ్యాపకేతర సిబ్బంది పని చేస్తున్నారు. సి.పి. బ్రౌన్ గ్రంథాలయాన్ని భాషాపరిశోధనా కేంద్రంగా మార్చి విశ్వవిద్యాలయానికి అనుబంధం చేశారు. తొలి స్నాతకోత్సవాన్ని 2012 నవంబరులో జరిపారు. ఉపాధ్యక్షులుగా ఆర్జుల రామచంద్రారెడ్డి, తరువాత ఆచార్య బేతవోలు శ్యామసుందర్, ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, ఆచార్య యం. రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతం ఆచార్య యం. సూర్యకళావతి ఉపాధ్యక్షురాలు.

తెలుగు శాఖ:

2005లో ప్రారంభించారు. ప్రస్తుత అధ్యాపకులు:

  1. ఆచార్య టి. రామప్రసాదరెడ్డి – ప్రొఫెసరు, డీన్, ఎడ్యుకేషన్
  2. డా. పి. రమాదేవి – అసోసియేట్ ప్రొఫెసరు
  3. డా. యన్. ఈశ్వరరెడ్డి – శాఖాధ్యక్షులు
  4. డా. యం. యం. వినోదిని – అసోసియేట్ ప్రొఫెసరు

(డా. టి. రామప్రసాదరెడ్డి, డా. రమాదేవి దంపతులు).

రెండేళ్ళ ఎం.ఏ. తెలుగు – సెమిస్టర్ విధానంలో నడుపుతున్నారు.

బ్రౌన్ పరిశోధనా కేంద్రం:

కడపలో బ్రౌన్ పరిశోధనా కేంద్రం 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో భాగంగా ప్రారంభమైంది. 1995లో జానమద్ది హనుమచ్ఛాస్త్రి సంకల్పంతో బ్రౌన్ లైబ్రరీ ఏర్పడింది. డా. యం. మల్లికార్జున రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో దీనికి బాధ్యులుగా పురోగతికి కృషి చేస్తున్నారు. 2020 జూలైలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి ఈ సంస్థను దర్శించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విలువైన ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాలు ఈ కేంద్రంలో భద్రపరిచారు.

ఎస్.వి. యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ శ్రీ రాళ్ళపల్లి రామమూర్తితో రచయిత, 1996

2.ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం (2006) రాజమహేంద్రవరం.

ప్రస్తుత ఉపాధ్యక్షులు ఆచార్య మొక్కా జగన్నాథరావు. డా. టి. సత్యనారాయణ, డా. టి. వాసు, డా. టి. లక్ష్మీనరసమ్మ, డా. కె.వి.యన్. వరప్రసాద్ తెలుగు శాఖలో అధ్యాపకులు. ఈ విశ్వవిద్యాలయ పరిధిలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో, ఏలూరులో పి.జి. కోర్సులున్నాయి.

3.కృష్ణా విశ్వవిద్యాలయం – మచిలీపట్టణం – 2008

ఉపాధ్యక్షులు డా. కె. బి. చంద్రశేఖర్. తెలుగు శాఖలో డా. వరుణకుమారి, డా. ఏ. వి. రమణమూర్తి బోధిస్తున్నారు.

4.విక్రమసింహపురి విశ్వవిద్యాలయం – నెల్లూరు – 2008

రిజిస్ట్రారు డా. యల్.వి.కృష్ణారెడ్డి. తాత్కాలిక అధ్యాపకులతో కాలం గడుపుతున్నారు. డా. కృష్ణారెడ్డి తిరుపతిలో తెలుగు ఎం.ఏ. పి.హెచ్.డి చేశారు. వారు తెలుగు శాఖను పర్యవేక్షిస్తున్నారు.

5.రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు – 2008

ఆచార్య ఏ. ఆనందరావు ఉపాధ్యక్షులు. తెలుగు శాఖలో – ఆచార్య యన్. నరసింహులు ప్రొఫెసరు. డా. పి. శ్రీనివాసులు, డా. వి. రవిశంకర్, డా. ఆంజనేయులు, డా. జి. అరుణ, డా. యం. ఓబులేశు అధ్యాపకులు.

6.కేంద్రీయ విశ్వవిద్యాలయం – అనంతపురం.

తెలుగు శాఖలో బూదాటి వెంకటేశ్వరులు లోగడ ఒక సంవత్సరం పని చేశారు.

తెలంగాణా:

7.తెలంగాణా విశ్వవిద్యాలయం – నిజామాబాదు – 2006

డా. డి. రవీంద్ర గుప్త ఉపాధ్యక్షులు. తెలుగు శాఖలో – ఆచార్య పి. కనకయ్య ప్రొఫెసర్. డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, కె. లావణ్య, వి. త్రివేణి, సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి అసోసియేట్ ప్రొఫెసర్లు.

8.మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం – నల్గొండ – 2008

ఆచార్య సి.హెచ్. గోపాలరెడ్డి ఉపాధ్యక్షులు. తెలుగు శాఖలో అధ్యాపకుల కొరత ఉంది.

9.పాలమూరు విశ్వవిద్యాలయం – మహబూబ్‌నగర్ – 2008

ఆచార్య యల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ ఉపాధ్యక్షులు. కొల్లాపూర్ పిజి సెంటర్, కొల్లాపూర్ – డా. యం. కృష్ణయ్య. 2015లో తెలుగు ఎం.ఏ. కోర్సులు ఆరంభమయ్యాయి.

ఈ విధంగా అంకుర దశలోనే ఈ విశవిద్యాలయాలు ‘నడుస్తు’న్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here