[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘ఆఖరి క్షణం!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap]లుగు గోడల మధ్య
నలుగురు చర్చించుకునే మాటను
తప్పో, ఒప్పో మనం నడుచుకునే
నడక బట్టి నిన్ను గుర్తిస్తుంది
ఈ సమాజం
కాగడాల పువ్వులు
చూడడానికి ఎంతో
ముద్దుగాను
ఆకర్షణీయంగా, సువాసనతో
వెదజల్లుతాయి
దాని స్థానాన్ని అది
తవ్వుకుంటుంది
కానీ
మనం ఏం
చేస్తున్నామో కాస్త
ఆలోచించండి
ఎవరో, ఒకరు నీ మీద
చెప్పిన అసభ్యపు
మాటలను
అతనే వచ్చి నీతో
ఒప్పు, తప్పో చర్చించకపోతాడా
పువ్వు మొలకెత్తడానికి
విత్తనాన్ని మనమే
వేస్తున్నాం
కానీ
మనకు ఒక విత్తనం
కావాలి అని తెలుసుకోలేకపోతున్నాం
అది కాస్తా చెట్టై దాని
స్థానాన్ని గుర్తుంచుకుంటుంది
ఎవరో అన్నారని
వాళ్ళు ఏదో ఇస్తారని
అనుకుంటే అది మన తప్పే
కాస్త మేలుకోండి
కంఠాన్ని కాస్త
రేడియోలా ప్రయోగించండి
చిక్కుడు గింజ నుండి
మెరుపుతీగలా
బాల్యం, యవ్వనం, వృద్ద్యాపం
కాస్త నాలుగు అంగుళాల
స్థలాన్ని చిక్కుడు (మానవులు)
గింజ కోరుకుంటుంది