యువభారతి వారి ‘ఆలోచనా లహరి’ – పరిచయం

0
9

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

ఆలోచనా లహరి

[dropcap]అ[/dropcap]ధ్యయనం పట్ల ఆసక్తిని పెంచేది విమర్శనం. సృజనాత్మక సాహిత్యం ప్రసరించడానికి విమర్శ తోడ్పడుతుంది. తెలుగు సాహిత్యంలో విమర్శ ప్రక్రియను బహుముఖాలుగా  విస్తరింపజేసిన ప్రసిద్ధ విమర్శకుల గురించి ఏర్పాటు చేసిన లహరీ కార్యక్రమమే – ఈ ‘ఆలోచనా లహరి’.

గతానుగతికమైన విమర్శన పథానికి కొత్త మలుపును ప్రసాదించిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి  డా. చల్లా రాధాకృష్ణ శర్మ గారు;

అరుదైన అందమైన వచనరచనకు శ్రీకారం చుట్టి, అనంత శేముషీవైభవంతో నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా సత్యాన్ని మధురంగా ప్రతిపాదించిన విమర్శకులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు;

తెలుగు ప్రజలకు విజ్ఞాన సర్వస్వాన్ని అందించాలని ఉద్యమించిన భాషాసేవకులు, బహుభాషావేత్తలు, చరిత్ర పరిశోధకులు, ఉత్తమ సాహిత్య విమర్శకులు, శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పంతులు గారి గురించి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు;

కాలానుగుణ్యమైన భావప్రకటనా సౌలభ్యాన్ని కోల్పోయి, ఎన్నడో వ్రాసిన వ్యాకరణానికి కట్టువడిపోయిన తెలుగుభాషను సముద్ధరించి, వ్యావహారిక భాషోద్యమాన్ని నిర్వహించి, తెలుగు భాషకు విస్తృతి కలిగించిన మహనీయులు, సద్విమర్శకులు, శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి గురించి డా. అక్కిరాజు రమాపతి రావు గారు;

తెలుగు పత్రికా రచనను శక్తిమంతం చేసిన మనీషి, సాహిత్య తపస్వి, శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి గురించి డా. ముదిగొండ శివప్రసాద్ గారు;

కవితా రచనలో మహోన్నత ప్రమాణాలందుకొని, అన్ని సాహిత్య ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించి, భారతీయ సాహిత్య శాస్త్ర ప్రమాణాల వెలుగులో తెలుగు సాహిత్యాన్ని సమాలోచించిన ఉత్తమ విమర్శకులు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి డా. జి వి సుబ్రహ్మణ్యం గారు –

యువభారతి పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా చేసిన ఉపన్యాస వ్యాస మణిహారమే ఈ ఆలోచనా లహరి.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%86%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%20%E0%B0%B2%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF/

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here