ఆమెని అడగండి కాస్త!

1
9

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఆమెని అడగండి కాస్త!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]న్ను తలుచుకునీ.. తలచుకునీ
ఎంతగా అలిసి నిద్రపోయి ఉంటావంటే..
కలలో నేను కనిపించినా విసుక్కుని
అటు తిరిగి పడుకుంటావేమో మరి!
***
చందమామ నుంచి వెన్నెల విడిగా ఉంటుందా..
నా హృదయం నుంచి నువ్వు పంపిన రాగం మూగదైపోతుందా!
నువ్వు నేను.. ఒకరినొకర్ని తలుచుకునే క్షణాలు
వెతుక్కునే తావులు ఒకటే కదా!
రా.. ఇటు వైపుగా..
ఎదురుచూపుల కళ్ళకి
నిన్ను చూపించు.. సాక్షాత్కరించు!
ఒక్క చూపు నా వైపు విసిరి
నన్ను బతికించి పో.. రా ఇటు వైపు!
***
ముఖం చూసుకుందామంటే అద్దం లేదు.
పోనీ నీ కళ్ళల్లో నన్ను చూసుకుందామంటే
నువ్వు లేవు!
అద్ధమైనా ఇచ్చి పో.. నువ్వైనా వచ్చిపో!
పోనీ ఎటు పోవాలో నేను.. అదైనా చెప్పి పో!
***
జీవితపు మలి సంధ్యలో కలిసింది
చూడండి ఆమె ఎంత నిర్దయురాలో?
ఇన్ని యుగాలుగా ఎక్కడెక్కడ తిరిగి
ఇంతాలస్యంగా ఇటుగా వచ్చిందో అడగండి కాస్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here