ఆరంభము

6
6

[dropcapa]”శా[/dropcap]న్నాళనింకా నిన్ని ఒగ మాట అడగాలని ఉండానా?” అంట్ని.
“అడగరా” అంటా తల గుంకాయిచ్చె అన్న.
“పరిణామక్రమము మనిషితాకి వచ్చె తలికి నిలిసిపోయ ఏలనా?”
“ఈ పుడగోసి గాన్ని చూసి దానికి దిగులురా, దాన్నింకానే”
“అబ్బబ్బ నువ్వు నీ అలకామాట్లు. నా చేతల తట్టుకొనేకి అయ్యెల్దునా, నే పోతానా” అంటూ లేస్తిని.
“రేయ్! రేయ్! కూకోరా, ఆయా కాలాల పరిణామక్రమానికి అనుగుణంగా బూమి మీద జీవాలు పుట్టి పెరిగె కాని, వాతావరణ పరిసర మార్పుల్ని తట్టుకుని బతికేకి అన్ని జీవాల చేతిలా కాలే. ఇట్లా మార్పుల్ని తట్టుకొని బతికినవే ఇబుడున్న జీవాలు, జనాలు. ఈ కాలానికి మనిషి పరిణామ క్రమములాగా భాగము అంతే కాని పరిణామక్రమము నిలిసిపోయిందని కాదు. ఇంగ కొన్ని వేలేండ్లకో లేదా యుగానికో మనిషి బూమి మీద బతికేకి కానట్ల పరిస్థితులు రావొచ్చు” అనిన అన్న మాటలకి అడ్డం పడి
“ఒగేల మనిషి అట్లా పరిస్థితుల్ని కూడా తట్టుకొని బతికే అనుకొనా, అబుడెట్ల” అంటూ తిరగా అడిగితిని.
“అదీ నిజమే! ఈ కోతులకి పుట్టిన నా కొడుకుని (మనిషిని) ఎట్లా నమ్మేకి అయ్యేలే. ఒగేల అట్లే జరిగినా కూడా ఏ గ్రహ శకలమో, ఉల్కనో వచ్చి బూమిని గుద్దే అనుకో అబుడు ఏమవుతుందంటావ్” అంటా అడిగె.
“సర్వ నాశనం అవుతుందనా” అంట్ని.
“తానే (కదా) అంటే ఆడికి మనిషి కత అయిపోతుంది కొత్త కత ఆరంభము అవుతుంది. కొత్త జీవి అవతారము ఎత్తుతుంది. ఇబుడు చెప్పరా పరిణామక్రమము ఏడ నిలిసిపోయ” అంటా అన్న నా పక్క చూసే.
నా గొంతులా నింకా మాట రాలే.
ఆడనింకా లేచి వచ్చిస్తిని.

***

ఆరంభము = ప్రారంభము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here