ఆశ అనేది ఒక రెక్కలున్న పక్షి!

1
10

[ప్రముఖ అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ రచించిన ‘Hope is the thing with feathers!’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of American poet Emily Dickinson’s poem ‘Hope is the thing with feathers!’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ఆ[/dropcap]శ అనేదొక రెక్కలున్న విషయం !
ఆత్మలో స్థిరంగా కూర్చుంటుంది.. కదలకుండా!
ఎప్పటికీ ఆపకుండా
పదాలు లేని పాటను అలా అనంతంగా పాడుతూనే ఉంటుంది.
గాలిలో కూడా తియ్యగా వినిపిస్తుంది.
చలితో ముడుచుకు పోయే చాలా పక్షులకి ఎండకాచినట్లున్న ఆశ..
తుఫానులో కూడా ఒక మంట లా ఎగుస్తూ
చిన్న పక్షి కూడా సిగ్గు పడేలా చేస్తుంది.
నేను ఈ ఆశని రాయిలా గడ్డ కట్టుకు పోయే మంచు దేశాల్లో చూసాను!
ఒక అపరిచిత సముద్రపు ఆకాశంలో చూసాను.
అయినా కూడా ఒక్కసారైనా అది నా లోపలి..
ఒక్క భాగాన్ని కూడా బదులుగా అడగలేదు.
అదీ ఆశ అంటే!

~

మూలం: ఎమిలీ డికిన్సన్

అనువాదం: గీతాంజలి


ఎమిలీ డికిన్సన్ (1830 – 1886) ప్రముఖ అమెరికన్ కవయిత్రి. ఏకాంతాన్ని అమితంగా ఇష్టపడిన ఎమిలీ వివాహం  చేసుకోలేదు. ఆమెకున్న మిత్రులంతా ఉత్తరాల స్నేహితులే. విస్తృతంగా రచించినప్పటికీ ఆమె జీవించి ఉండగా ప్రచురితమైనవి సుమారు 1,800 కవితలు, ఒక ఉత్తరం మాత్రమే. క్లుప్తంగా ఉండి, కొన్నిసార్లు శీర్షికలు లేకపోవడం ఆమె కవితల విశేషం! మృత్యువు, అమరత్వంపై ఎక్కువగా కవితలల్లారు ఎమిలీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here